లడఖ్‌లోని గాల్వన్ లోయ‌లో భారత్ చైనా సైనిక ఘర్షణల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలు, అశ్రు నయనాల మధ్య సూర్యాపేట లో జరిగాయి. సూర్యాపేట సమీపంలోని కేసారంలో సంతోష్ బాబు కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిలో సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడికి కడసారి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువకులు వందేమాతరం, భారత్ మాతాకీ జై, సంతోష్ బాబు అమర్ రహే అని నినాదాలు చేశారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ.. తమ దేశభక్తిని ప్రదర్శించారు.

IHG

అంత్యక్రియలు నిర్వహించే ముందు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు సంతోష్ పార్థీవ దేేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఇక ఈ అంతిమ యాత్రకు  పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు.  సంతోష్‌కు కడసారి వీడ్కోలు పలికే సమయంలో ఆ ప్రాంతం అంతా ఉద్విగ్నంగా మారిపోయింది. సంతోష్‌బాబు కుటుంబానికి మంత్రులు ధైర్యం చెప్పారు.

IHG

తెలంగాణ ప్రభుత్వం వారికి ఉంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి భరోసా ఇచ్చారు. సంతోష్‌ భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమర వీరుడికి గుర్తుగా సూర్యాపేట కూడలిలో సంతోష్‌ బాబు  కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  ఇక  కరోనా వైరస్ ప్రభావంతో కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: