భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుతుతున్నాయి. గత రెండు వారాలుగా సగటున రోజుకి పది వేల కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందించడానికి ఆసుపత్రుల కొరత ఏర్పాటుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,66,946కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం  12,237కి పెరిగింది. 1,60,384 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,94,325 మంది కోలుకున్నారు.  గత 24 గంటల్లో దేశంలో 12,881 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 334 మంది మరణించారు. కరోనా బాధితులను కలిసిన వాళ్ళను క్వారంటైన్ లో ఉంచడానికి కూడా సెంటర్లు తక్కువ పడుతున్నాయి. దీంతో ఒడిశాలో ఓ వ్యక్తి బాత్రూంను క్వారంటైన్ సెంటర్ గా వినియోగించాడు.

 

ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలకు వెళ్లిన వాళ్ళు లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన మానస్ పత్రా తమిళనాడులో ఉద్యోగం చేస్తున్నాడు.  లాక్ డౌన్ సడలించిన తర్వాత అతడు తన స్వరాష్ట్రం వెళ్లారు. ఒడిశాలో అడుగుపెట్టగానే అధికారులు వారం రోజుల పాటు సుదుకాంతి పాఠశాలలో ప్రభుత్వం నడుపుతున్న తాత్కాలిక వైద్య శిబిరం క్వారెంటైన్‌లో ఉంచారు.  అయితే అతనికి ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఏడు రోజులకు డిశ్చార్జ్ చేశారు. మరికొన్ని రోజులు మాత్రం తప్పకుండా హూం క్వారంటైన్ ఉండాలని డాక్టర్లు సూచించారు. 

 

కానీ అతనిది పెద్ద కుటుంబం..  ఇంట్లో తగినంత స్ఠలం లేదు. దీంతో టీఎంసీలో తన బసను పొడిగించాలని మానస్ పత్రా కోరాడు.  కానీ అతని అభ్యర్థనను వారు తోసి పుచ్చారు.. అస్సలు కుదరదని తేల్చి చెప్పారు.  పాపం అసలే పేదరికం.. అధికారుల సూచనలు పాటించాలి.. ఇక తప్పని సరి పరిస్థితిలో  కుటుంబ సభ్యుల భద్రత కోసం టాయిలెట్‌లో ఉన్నాడు. ఈ నెల 9 వ తేదీ నుంచి 15 వరకు ఏడు రోజులు ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: