నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బెంచ్ మార్క్ సూచీలన్ని కూడా లాభాల్లోనే ముగిసాయి. హెవీ వెయిట్ షేర్లు ర్యాలీతో మార్కెట్ కు బాగా కలిసొచ్చింది. వీక్లీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంటాక్ట్స్ నేటితో ముగియడం వల్ల షార్ట్ కవరింగ్ తో నేటి మార్కెట్ ర్యాలీ చేసిందని చెప్పవచ్చు. ఇక నేటి ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 768 పాయింట్లు ర్యాలీ చేయగా నిఫ్టీ కూడా 10111 పాయింట్లను చేరుకుంది. ఇక చివరకు సెన్సెస్ 700 పాయింట్ల లాభంతో.. 34208 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 10092 పాయింట్ల వద్ద నేడు ముగిసాయి.

IHG

 

ఇక అలాగే నేటి స్టాక్ మార్కెట్ లోని విశేషాల్లోకి వస్తే..  నిఫ్టీ 50 లో బజాజ్ ఫిన్సర్వ్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, జి ఎంటర్టైన్మెంట్, వేదాంత షేర్లు లాభాల బాట పడగా అందులో బజాజ్ ఫిన్సర్వ్ ఏకంగా 8 శాతం లాభపడింది. ఇక మరోవైపు భారతి ఎయిర్టెల్, హెచ్ యు ఎల్, టిసిఎస్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ నష్టాల బాట పట్టాయి. ఇక ఇందులో టిసిఎస్ అత్యధికంగా ఒక శాతం పైగా నష్టపోయింది.

 


ఇక అలాగే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ 76.17 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. ఇక అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కాస్త పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 1.18 శాతం పెరిగి 41.19 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఏ ముడి చమురు ధర బ్యారెల్ కు 0.82 శాతం పెరిగి 38.24 డాలర్ల వద్దకు చేరుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: