ఆంధ్రప్రదేశ్ లో కరోనా భయంకరంగా వ్యాపిస్తోంది. మొదట్లో ఏపీలో అంతగా కేసులు లేవు.. ఆ తర్వాత ఓ మాదిరిగా ఉండేవి.. కానీ రాను రాను ఏపీలో కూడా కరోనా జోరు పెంచుతోంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మరీ ఎక్కువగా కేసులు వస్తున్నాయి. తాజా లెక్కలు చూస్తే గుండె దడ ఖాయం. ఏపీలో గత ఇరవై నాలుగు గంటల్లో 13923 పరీక్షలు జరిపితే.. ఏకంగా 425 పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి.

 

 

ఇలా ఒక్కరోజులోనే 400 పైగా కేసులు నమోదు కావడం అంటే చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకూ 100- 200 కేసులు కొత్తగా నమోదయ్యాయి. రెండు రోజులుగా ఈ కేసులు సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. నిన్న 351 కేసులు నమోదు కాగా.. ఈరోజు మరీ భయంకరంగా ఏకంగా 425 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

 

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ కొత్తగా నమోదాన 425 కేసుల్లో.. 299 స్థానికంగా ఉన్నవారికి సోకాయి. మరో 126 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి. మిగిలినవి విదేశాల నుంచి వచ్చిన వారికి సోకిన వారివి. వీటితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసులు 7496 కు చేరాయి.

 

 

ఇక ఈ మొత్తం 7496లో 2983 ఆస్పత్రులలో కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 2779 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 92 కి చేరింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: