చైనా దేశం ఇతర దేశాల ప్రజలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలను చేస్తూ వస్తోంది. ఇప్పటికే చైనా మెడీ టూరిజంను ప్రారంభించిందని.... ఈ విధానం ద్వారా మనుషులకు అవయవాలను మార్చే ప్రక్రియ చేపడుతోందని వార్తలు వచ్చాయి. మరోవైపు టూరిజం అభివృద్ధి కోసం చైనా ఎంతో కృషి చెస్తోంది. అందులో భాగంగా చైనా చేసిన ఒక ప్రయోగం మాత్రం వికటించింది. 
 
దీంతో చైనా ఆ ప్రాజెక్టులను ఆపుతోంది. చైనా ఏడాది క్రితం నుంచి దేశంలో గాజు వంతెనల ప్రాజెక్టులను చేపడుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో గాజు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చూడటానికి గాజు అందంగా ఉంటుందనే ఉద్దేశంతో చైనా ఈ తరహా ప్రాజెక్టులను చేపడుతోంది. చైనాలో దాదాపు 2300 గాజు వంతెనలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 35 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిని వెంటనే ఆపేయాలని చైనా నిర్ణయం తీసుకుంది. 
 
చైనా లాంగ్ జర్నీల కోసం కూడా గాజుతో నిర్మాణం చేసిన వాకింగ్ వంతెనలను ఏర్పాటు చేసింది. అయితే వర్షాలు కురిసిన సమయంలో కొంతమంది వాకింగ్ వంతెనల మీద నుంచి జారి కిందపడి చనిపోతున్నారు. గత ఏడాది కాలంలో గాజు ప్రాజెక్టుల వల్ల దాదాపు 200 మంది మృతి చెందగా 1500 మంది గాయాలపాలయ్యారు. దీంతో చైనా ఈ ప్రాజెక్టులపై నిషేధం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇతర దేశాల ప్రజలను ఆకర్షించాలనే ఉద్దేశంతో చైనా తీసుకున్న నిర్ణయం ఫెయిల్యూర్ గా నిలిచింది. చాలా మంది చైనా సాధించిన సక్సెస్ లనే చూస్తున్నారు తప్ప ఆ దేశం ఫెయిల్యూర్స్ గురించి తెలుసుకోవట్లేదు. చైనా దేశం సక్సెస్ లను మాత్రమే బయటకు తెలిసేలా చేసి ఫెయిల్యూర్స్ ను దాచేస్తోంది. మరోవైపు ప్రపంచ దేశాలలో కరోనా వల్ల మారిన పరిస్థితుల ప్రభావం చైనాలోని మ్యానుఫాక్టరింగ్ సెక్టార్ పై పడింది. అక్కడి ప్రజలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉండటంతో చైనా దానిని కంట్రోల్ చేయడం కోసం భారత్ తో వివాదానికి సిద్ధమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: