తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ లో 60.1 శాతం ఉత్తీర్ణులవగా, సెకండియర్ లో 68.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఫస్టియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 67.4 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 52.30గా నమోదైంది. సెకండియర్ లో బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ లో మేడ్చెల్ అగ్రస్థానంలో నిలిచింది.

 

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. మెదక్ జిల్లా చేగుంటకు చెందిన శిల్పా అనే ఇంటర్ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఆత్మహత్య చేసింది.  గత ఏడాది వచ్చిన రిజల్ట్ విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అందరూ ఎంతోగొప్పగా మార్కులు వస్తాయని భావించగా 1, 2 మార్కులు వచ్చి గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు.

 

ఈసారి రిజల్ట్ కూడా అలాగే వస్తుందని భావించి..  చేగుంటకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని శిల్ప.. చేగుంటలోని మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్‌లో బైపీసీ చదువుతుంది.  ఆమెకు 18 వ తేదీన ఫలితాలు వస్తాయని తెలిసినప్పటి నుంచి ఆ విద్యార్ధినిలో భయం పట్టుకుంది. ఫెయిల్ అయినా పర్వాలేదు అని తల్లిదండ్రులు సర్దిచెప్పారు. కానీ, ఎక్కడ తోటి విద్యార్థులు హేళన చేస్తారో అనే భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: