భారత్-చైనా సరిహద్దు లో రోజురోజుకు యుద్ధ వాతావరణం నెలకొంటుంది. మొన్నటి వరకు కేవలం భారత చైనా సరిహద్దుల్లో భారీ మొత్తంలో సైనికులు మోహరించటమే జరిగింది. కానీ తాజాగా అక్రమంగా చైనా దళం భారత సరిహద్దుల్లో కి దూసుకొచ్చి 20 మంది సైనికులను పొట్టన  పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తర్వాత భారత్ ఏం చేయబోతోంది అనే దానిపైన ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. అయితే ప్రస్తుతం చైనాతో యుద్ధం కనుక జరగాల్సి ఉంటె ప్రపంచ దేశాలు భారత్ వైపు నిలుస్తాయి అనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు  దీనిని బహిరంగంగానే ప్రకటించారు. 

 

 అయితే చైనా వ్యూహం ఏమిటి అంటే.. భారత్ ని భయ పెట్టిన వెనకడుగు వేసేలా చేస్తే ప్రపంచ దేశాలు  భారత్ కి మద్దతు ఇవ్వకుండా ఉంటాయి అనేది చైనా వ్యూహం అని అంటున్నారు విశ్లేషకులు. ఇంక మరోటి భారత్లో మౌలిక వసతుల నిర్మాణం జరగకుండా చూడటం. అంతే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ భారత్ ని  తక్కువచేసి చూపించాలనే ప్రయత్నం చైనా వ్యూహం అని అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఇలా సైనికులపై దాడి చేసి ఏకంగా ప్రాణాలను సైతం తీస్తున్నారు అని అంటున్నారు. 

 

 అయితే చైనా ఊహించిన విధంగా కాకుండా భారత్ ప్రస్తుతం ఎంతో  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రపంచ దేశాలు కూడా చైనా సరిహద్దు విషయంలో భారత్ కి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే నిర్మాణాలు చేపట్టి వద్దు అని చైనా చెబుతుంటే ఎట్టి పరిస్థితిలో నిర్మాణాలు చేపట్టి తీరుతాం  అని చెబుతోంది. ఇదే సమయంలో నేపాల్ పాకిస్థాన్ తో కలిపి మూకుమ్మడిగా దాడి చేయడానికి సిద్ధం అంటూ  చైనా  హెచ్చరికలు ఇస్తుంటే.. దేనికైనా దీటుగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ భారత్ బదులిస్తోంది. మరి ఈ రెండు దేశాల వ్యూహాలలో ఎవరి  వ్యూహం ఫలిస్తుంది అన్నది భవిష్యత్తులో తేలనుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: