ఈ మధ్యకాలంలో ప్రజల చెంతకే అన్ని వచ్చేలా ఆన్లైన్ సేవలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఏ వస్తువు కావాలి అన్న ఆన్లైన్లో బుక్ చేస్తే సరిపోతుంది ఇంటి గడప ముందు వచ్చి వాలిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి ఆన్లైన్ సర్వీస్ లో ఎక్కువైపోయాయి. ఆన్లైన్ షాపింగ్ చేసిన తర్వాత కస్టమర్ రివ్యూ అడుగుతూ ఉంటారు సదరు ఆన్లైన్ కంపెనీలు.  ఇక మనం కొన్న వస్తువు క్వాలిటీ ఉందా.. వస్తు ఏమైనా పాడైందా అనేదాని రివ్యూ లో  చెబుతూ ఉంటారు కస్టమర్లు.ఇది సాధారణంగా జరిగేది. కానీ ఇక్కడ రివ్యూ ఇవ్వడమే కస్టమర్ కి శాపం గా మారిపోయింది.

 


 ఆమె ఇచ్చిన రివ్యూ ఆమెను ఆస్పత్రి పాలు చేసింది.  నెగిటివ్ రివ్యూ ఇచ్చిన పాపానికి ఏకంగా ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల ప్రయాణించి  ఆమెను వెతికి మరీ చితకబాదాడు షాప్ యజమాని.  ఈ ఘటన చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... జియో  డి అనే మహిళ ఆన్లైన్ స్టోర్ నుంచి 300 యువన్ల  విలువైన బట్టలను ఆర్డర్ చేసింది. ఇక మూడు రోజుల్లో సదరు మహిళ దుస్తులు వస్తాయని స్టోర్ తెలిపింది. కానీ చెప్పిన సమయానికి డెలివరీ కాకపోవడంతో ఆ స్టోర్ కి ఆమె నెగిటివ్ రేటింగ్ ఇచ్చింది.

 


 దీంతో ఆ స్టోర్ స్కోరు 12 పాయింట్లకు పడిపోయింది. ఇక నెగటివ్ రివ్యూ ఇచ్చిన మహిళపై యజమాని కోపం తో ఊగిపోయాడు, వందల కిలోమీటర్లు ప్రయాణించి మరి సదరు మహిళ అడ్రస్ కు చేరుకొని ఆ మహిళను రోడ్డుమీద చితకబాదాడుm దీంతో తీవ్రంగా గాయాలు పాలైన సదరు మహిళను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న అందరు షాప్ యజమాని పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: