భారత్ అలీన విధానాన్ని నమ్ముకున్న దేశం. మహాత్ముడు పుట్టిన దేశం. అహింసావాదాన్ని బలంగా విశ్వసించే దేశం. శాంతి మంత్రం చదివిన పండిట్ జవహర్ నెహ్రూ ఏలిన దేశం. మంచితనానికి  మారుపేరుగా ఉన్న దేశం. ప్రపంచానికి గురుస్థానంలో ఉంటూ అందరూ బాగుండాలని, అంతా మంచి జరగాలని కోరుకునే ఏకైక దేశం.

 

అటువంటి భారత్ కి ఆ మంచే చెడ్డ అవుతోందా. భారత్ సహనం మెతకగా కనిపిస్తోందా. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. లేకపోతే నేపాల్ ఏంటి భారత్ లో ఒక భాగాన్ని కలిపేసుకుని తన మ్యాప్ లో పెట్టేసుకుంటుంది. దానికి ఎంత ధైర్యం. నేపాల్ భారత్ సంబంధాలు చరిత్రకు నిలిచినవి. ఈ ప్రపంచంలో భారత్ తరువాత మరో హిందూ దేశం అంటే నేపాల్ పేరు చెప్పాలి.

 

అటువంటి నేపాలి ఇపుడు భారత్ మీద నిప్పులు కక్కుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది. అంటే తెర వెనక డ్రాగన్ ఉంది. చైనా అడిస్తోంది. నేపాల్ ఆడుతోంది. లేకపోతే నాగుపాము లాంటి భారత్ ముందు వానపాములా నేపాల్  డ్యాన్స్ చేయగలదా. ఇక మరో వైపు దాయాది పాకిస్తాన్. దాని అసలు పేరు పాపిస్తాన్. అధి గత డెబ్బై ఏళ్ళుగా భారత్ ని కాల్చుకుని తింటోంది. తాను పేద దేశమైనా ఫరవాలేదు, తన దేశం ఆకలితో చచ్చిపోయినా ఫరవాలేదు. కానీ భారత్ మాత్రం పచ్చగా ఉండకూడదు, ఈ శాడిజంతో ఉన్మాదంతో పాక్ ప్రతీ పోద్దూ రెచ్చిపోతూనే ఉంది.

 

ఇపుడు కొత్తగా చైనా రంగంలోకి వచ్చింది. కొత్తగా అంటే  ఇపుడే అని కాదు, కానీ మరీ ఇంతలా బాహాటంగా బరితెగించి. గాల్వాన్ లోయ తనది అంటోంది. గీత దాటి వస్తోంది. భారత్ ని కవ్వించి చూస్తోంది. ఇలా మూడు వైపుల నుంచి భారత్ కి ఇపుడు ముప్పు పొంచి ఉంది. పైగా పై రెండు దేశాలను చైనా దగ్గరుండి మరీ నడిపిస్తోంది. ఇవి కాకుండా శ్రీలంకను దువ్వుతోంది. మరిన్ని చిన్న దేశాలను మచ్చిక చేసుకుని తన వైపునకు తిప్పుకుంటోంది.

 

ఒక శత్రువు విడిగా వస్తే భారత్ పులి పంజా విసిరి తన సత్తా చూపిస్తుంది. మూడు దిక్కులా వస్తే మిగిలిన వారు అద్రుశ్య హస్తం అందిస్తే భారత్ ఇక్కట్లు చూడాలని  చైనాది  ప్లాన్. మరి భారత్ దీన్ని ఎలా ఎదుర్కొంటుందోనని ఆందోళన సర్వత్రా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం భారత్ వైపు సత్యం ఉంది. భారత్ లో నిండైన ధైర్యం ఉంది. అందుకే తుది విజయం మాత్రం భారత్ దేనని చెప్పకతప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: