నూరేళ్ల బంధంగా పిలవబడే పెళ్లి ఇప్పుడు మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోతుంది. ఈ కాలంలో ప్రేమ వివాహాలు సంవత్సరం తిరిగేలోపే కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. ఏడడుగులు వేసినంత కాలం ఇవ్వడం లేదు ఈ పెళ్లి బంధం. గృహనిర్బంధం, వేధింపులు, వరకట్నం వేధింపులు ఇలా ఒకటి కాదు ఎన్నో సమస్యల మధ్య పెళ్లి బంధం తెగిపోతుంది. స్కూలు, కాలేజీ, ఉద్యోగ స్థలాలు ఇలాంటి సమయంలో ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీస్తుంది. కానీ నీ ఇటువంటి పెళ్లిళ్లు ఎక్కువశాతం ఎక్కువ రోజు నిలబడడం లేదు.

 


ఎంతో అర్థం చేసుకొని ప్రేమ వివాహాలు చేసుకుంటున్నాం అని చెప్పి, కొద్దిరోజుల్లోనే విడిపోయి మానసిక క్షోభకు గురి అవుతున్నారు. ఇటువంటి సమయాల్లో క్షణికావేశానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమ వివాహాలు కాదు, పెద్దలు కుదిర్చిన వివాహంలో కూడా కొంత మేరకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. భార్యభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్​ తిరుమలగిరి పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనిత విహార్ కాలనీలో నివాసముంటున్న బెన్నీ ఆండ్రూ అనే వ్యక్తితో మూడు నెలల క్రితం ప్రియాంక అనే యువతికి ఆర్య సమాజ్​లో వివాహం జరిగింది.

 

 

ఈ కొద్ది రోజుల్లోనే ఆండ్రూ అసలు స్వరూపం బయటపడింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం ప్రియాంకకు తెలిసింది. ఈ విషయంపై నిలదీసిన ఆమెను... ఆండ్రూ మానసికంగా శారీరకంగా హింసించాడని మృతురాలి తల్లి ఆరోపించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక గురువారం ఉదయం 9 గంటల సమయంలో... పడక గదిలోని ఫ్యాన్​కు ఉరేసుకుంది. గమనించిన ఇరుగుపొరుగువాళ్లు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ప్రియాంక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియాంక భర్త ఆండ్రూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: