సాధారణంగా విమాన ప్రయాణం అప్పుడప్పుడు ప్రయాణించే వారికి.. కొత్తగా ప్రయాణించే వారికి భలే థ్రిల్ గా ఉంటుంది.  కానీ ఓ మహిళ ఏకంగా  సగటున ఏడాదికి 225 విమాన ప్రయాణాలు చేస్తుందని ఎవరైనా భావిస్తారు.  కానీ  సదరు మహిళ అన్ని సార్లు విమాణ ప్రయాణం కాదు కదా ఒక్కసారి కూడా విమనం ఎక్కిన పాపాన పోలేదు.. కానీ టిక్కెట్లు మాత్రం పర్ఫెక్ట్ గా బుక్ చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు అలా  నాలుగేళ్ల వ్యవధిలోనే ఏకంగా 900 విమాన టికెట్లను బుక్ చేసి పారేసిందామె.  అదేంటీ ఇన్ని సార్లు విమానం టికెట్లు బుక్ చేసుకోవడం ఏంటీ.. ఇందులో ఏం మతలబు ఉందా అని అనుకుంటున్నారా.. ఉంది పెద్ద ఘరానా మోసమే దాగి ఉంది.

 

వివరాల్లోకి వెళితే.. చైనాలోని నాంజింగ్‌కు చెందిన 45 ఏళ్ల లీ అనే మహిళ 2015 నుంచి 2019 వరకు దాదాపు 900 విమాన టికెట్లను బుక్ చేసుకుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడే పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఉంటాయో చూసుకొని మరీ టికెట్లు బుక్ చేసేది. పక్కా ప్రణాళికతో ఎంపిక చేసిన విమానాల్లో టికెట్లను బుక్ చేసి, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విమానాలు రద్దవుతుంటాయి. ఆ తిరకాసులో ఆమె మాత్రం డబ్బులతో పండగ చేసుకుంటుంటుంది.

 

అయితే ఈ ఫ్లైట్ బుక్ చేసే సమయంలోనే పక్కా ప్లాన్ తో ఉంటుంది.  ఫ్లైట్ డిలే/కేన్సిల్ ఇన్సూరెన్స్‌లను కూడా కొనుగోలు చేసేది. ఇక్కడ మరో తెలివిగల పనేం చేసిందంటే.. తన ఒక్కరి పేరునే పదే పదే వాడితే అనుమానాలు వస్తాయని, తన స్నేహితులు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా వాడుకుంది. మొత్తం 20 మంది పేర్లతో టికెట్లను బుక్ చేసుకుని, ఏకంగా రూ.3.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు క్లైమ్ చేసుకుంది. ఈమె వ్యవహారంలో అనుమానం వచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఆరా తీయగా అసలు విషయం బయటకు పొక్కింది. దీంతో లీ ని నాంజింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: