కేంద్ర రక్షణ మంత్రి మరియు హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఫోన్ లో సంభాషించారు. ప్రధాని మోడీ తో జరగబోయే అఖిలపక్ష సమావేశంలో కచ్చితంగా పాల్గొనాలని సూచించారు. మరోపక్క రేపు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే నాలుగు స్థానాలు వైయస్ జగన్ పార్టీ గెలిచే అవకాశం ఉండటంతో… ప్రధాని మోడీ తో వైయస్ జగన్ అఖిలపక్ష భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

IHG

ఇదే సమయంలో మరోపక్క చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో రాజ్యసభ గురించా..? లేకపోతే చైనాతో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించా..?, భారత్ సరిహద్దుల విషయంలో అని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ భేటీ జరుగుతుందా ? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మొత్తంమీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడటం బట్టి చూస్తే.. ఖచ్చితంగా భారత్ యుద్ధానికి సిద్ధమైందని పరిశీలకులు భావిస్తున్నారు.

IHG's meeting with Jagan

దీంతో భారత సరిహద్దుల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు. ఇంకోపక్క కేవలం ఈ అఖిలపక్ష సమావేశం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి మాత్రమే అని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఒకేసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేయటం ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీ వర్గాల్లోనూ హైలెట్ న్యూస్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: