పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలని క్షత్రియ సామాజికవర్గం ఎంత ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ధికంగా బలంగా ఉన్న ఈ రాజులుకు వెస్ట్‌లో గెలుపోటములని డిసైడ్ చేయగల సత్తా ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేయడానికి రాజుల పాత్ర చాలానే ఉంది. అయితే ఐదేళ్లు అధికారంలో చంద్రబాబు మాత్రం రాజులకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. వారి సామాజికవర్గానికి చెందిన అశోక్ గజపతి రాజుకు కేంద్ర పదవి దక్కేలా చేశారు.

 

కానీ ఆయనకు తప్ప మిగతా నేతలకు పెద్దగా అవకాశం దక్కనివ్వలేదు. ముఖ్యంగా 15కి 15 సీట్లు ఇచ్చిన వెస్ట్‌లో రాజుల వర్గానికి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో రాజులు టీడీపీకి దూరమయ్యారు. ఇక ఈ అవకాశాన్ని జగన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకువెళ్లారు. ముగ్గురు రాజులకు సీట్లు ఇచ్చారు. ఆచంట చెరుకువాడ రంగనాథ రాజు, నరసాపురం అసెంబ్లీకి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్‌లో రఘురామకృష్ణం రాజుని బరిలోకి దించారు.

 

ఇలా ఒక్కసారే మూడు సీట్లు ఇవ్వడంతో క్షత్రియ సామాజికవర్గం ఓట్లు వన్‌సైడ్‌గా పడి వైసీపీకి ప్లస్ అయింది. అయితే జగన్ అప్పుడు అలా ప్లస్ చేస్తే, ఇప్పుడు మాత్రం రఘురామకృష్ణంరాజు దెబ్బకు రాజులు సెపరేట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వారిలో వారికే పడకపోవడం వల్ల వైసీపీకి మైనస్ అయ్యేలా ఉంది. మామూలుగా తనకు రావాల్సిన మంత్రి పదవిని చెరుకువాడ తన్నుకుపోయారని ప్రసాదరాజు ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నారు.

 

అయితే ఆయన అసంతృప్తిని బహిరంగంగా ఎప్పుడు వ్యక్తపర్చలేదు. కానీ సడన్ గా రఘు వచ్చి రచ్చ చేయడంతో, ప్రసారరాజు, చెరుకువాడ కలిసి ఆయనపై తిరగబడ్డారు. ఇలా వీరిలో వీరు గొడవపడటంతో రాజులు రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తోంది. వెస్ట్‌లో రఘురామకృష్ణంరాజుకు సపోర్ట్‌గా ఉన్నవారు ఇప్పుడు వైసీపీకి యాంటీగా మారుతున్నట్లు కనబడుతోంది. దీనివల్ల పార్టీకు కాస్త మైనస్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషుకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: