ప్రస్తుతం కరోనా  వైరస్ భారత్ పై  పంజా విసురుతున్న  విషయం తెలిసిందే. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనే  ఈ మహమ్మారి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతూ ఎంతో మందిని బలితీసుకుంది. ఇక తెలుగురాష్ట్రాల విషయానికొస్తే కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉంది అని చెప్పాలి. ఎక్కువ టెస్టులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో తక్కువ టెస్టులు చేస్తున్న తెలంగాణలో కూడా ఈ మహమ్మారి వైరస్ కాస్త నియంత్రణలోనే ఉంటుంది. ఎప్పుడైతే లాక్ డౌన్ సడలింపులు  ఇచ్చారో  అప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్న  విషయం తెలిసిందే . 

 

 ప్రతి రోజు భారీగా కేసులు నమోదు అవుతుండడంతో  తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే అక్కడ అతి ఎక్కువ  టెస్ట్ లు  చేస్తూ ఉంటే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే అతి ఎక్కువ టెస్ట్ లు  చేస్తున్నారు అయినప్పటికీ ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. ఇక కరోనా  పరీక్షల విషయంలో హైకోర్టు ఏకంగా తెలంగాణ సర్కార్ పై సీరియస్ అయింది. పోలీసులు డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు కరోనా  వైరస్ బారిన పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ ప్రశ్నించింది.

 

 

 ప్రస్తుతం తెలంగాణలో ప్రతి వందమందిలో 19 మందికి పాజిటివ్ వస్తోంది. అయితే దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పాజిటివ్ రేట్ లేడు. ఇదే  ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే గత నెల 16వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 21 వేల కరోనా  నిర్ధారణ పరీక్షలు మాత్రమే చేశారు, ఇంతమందికి టెస్ట్ చేస్తే అందులో 3200 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక తెలంగాణలో పాజిటివ్ రేట్  18.1 గా ఉంది. ఈ  పాజిటివ్ నెల రోజుల క్రితం వరకు కేవలం 6.1 గా ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో కేవలం 40 వేలకు పైగా మాత్రమే టెస్ట్ లు  చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ సార్ కాస్త సీరియస్గా దృష్టి పెట్టి కరోనా వైరస్ టెస్ట్ లను  పెంచితే బావుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: