తెలంగాణ కాంగ్రెస్ కి తర్వాత అధ్యక్షుడు ఎవరు అవ్వబోతున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కీలక చర్చ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అప్పట్లో నేతల మధ్య వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి అని అనుకున్నట్లు అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్  కారణంగా ఈ అధ్యక్ష ఎన్నిక కాస్త వాయిదా పడింది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది రేవంత్ రెడ్డి అని  ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. 

 


 రేవంత్ రెడ్డి చేతిలోకి పార్టీ వస్తేనే మళ్లీ పూర్వవైభవం సాధించడం సాధ్యం అవుతుంది అని పలువురు విశ్లేషకులు కూడా అభిప్రాయ పడ్డారు. తాజాగా మరోసారి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక తెర మీదికి వచ్చింది. తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఖాయం  అయినట్లు  ఢిల్లీ వర్గాల్లో  టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ను  ఢీకొట్టే కలిగినటువంటి వాక్చాతుర్యం బలం రేవంత్ రెడ్డి కి మాత్రమే ఉంది...  గతంలో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లు కూడా  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 


 వీరందరూ ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి నాలుగు కారణాలు చెబుతున్నారు.. కేసిఆర్ కి మాటకు మాట జవాబు ఇచ్చి సరైన కౌంటర్ ఇవ్వగలడు. కుంభకోణాలు వాటన్నింటినీ బయటకు తెచ్చి ప్రస్తుత అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. వీటికి తోడుగా మిగతా నాయకులు కార్యకర్తలు నేతలు అందరిని కలుపుకుపోతాడు అన్నటువంటి ఒక ఫీలింగ్. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ  కూడా అందరిని కలుపుకోవడం సాధ్యం కాలేదు. ఒకవేళ రేవంత్ పార్టీ పగ్గాలు చేపడితే పార్టీకి  పూర్వవైభవం రావటానికి  ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: