రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్షాలు చాలా వరకు ప్రజంట్ ఉన్న సమస్యల విషయంలో అధికార పార్టీలపై సరైన విధంగా నిలదీయడం లేదని  వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.  తెలంగాణ  రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ  ఎక్కువగా ప్రజా సమస్యల గురించి తమ పార్టీ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయటానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వినబడుతున్నాయి. కరోనా వైరస్ సమయంలో అసలు ప్రతిపక్షాలు రాష్ట్రాలలో ఉన్నాయా అన్నట్టుగా రెండు రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులు వ్యవహరించారని.. కానీ ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గినా గాని తమ స్వప్రయోజన విషయాలపైన రాజకీయాలు చేస్తున్నారు గాని అసలు ప్రజలు పడుతున్న కష్టాల గురించి రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సరైన విధంగా అధికార పార్టీలపై పోరాడటం లేదని విమర్శలు వార్తలు బలంగా ప్రజల నుండి వస్తున్నాయి.

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షల విషయంలో ప్రజల తరఫున న్యాయస్థానాలు మాట్లాడటమే తప్ప ప్రతిపక్షాలు ఇప్పటివరకూ అధికార పార్టీని నిలదీసిన సందర్భం ఒకటి లేదు అని జనాలు అంటున్నారు. ఇప్పుడేదో ఇటీవల పోతిరెడ్డిపాడు, గోదావరి నది ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ హడావిడి చేస్తోంది.. కానీ తెలంగాణలో అసలైన సమస్య కరోనా వైరస్ విషయం లో సరైన విధంగా ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నిలబడటం లేదన్న విమర్శ గట్టిగా తెలంగాణ రాజకీయాల్లో వినబడుతోంది.

 

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల తరఫున పోరాడకుండా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఉండటమే బెటర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల అధికారంలో ఉన్న వైసీపీ ఆ పార్టీకి చెందిన నాయకులను అరెస్టు చేసిన సమయంలో హైదరాబాద్ నగరం నుండి కదిలారు తప్ప… ప్రజల తరపున కరోనా వైరస్ విషయంలో అదేవిధంగా విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో కదలు లేదన్న విమర్శలు ఏపీ జనాల నుండి  వస్తున్నాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్షాలు సరైన రీతిలో జనాల తరపున పోరాడటం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: