లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది వరకూ భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. చైనా సైన్యం భారత్‌ సైనికులపై ఇనుప కడ్డీలు, కర్రలు, రాళ్లతో దాడి చేసింది. ఈ కుట్ర దాడికి భారత్ సైనికులు కూడా దీటుగా బదులు చెప్పాయి. ఈ ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. అటు చైనా సైనికులు కూడా 45 వరకూ మరణించినట్టు వార్తలు వచ్చాయి.

 

 

అయితే చైనా సైనికులు ఈ ఘర్షణలో వాడిన ఆయుధాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిని చూస్తే.. మన సైనికులను ఎంత దారుణంగా చైనా వాళ్లు చంపారో అర్థమవుతుంది. ఈ దాడి సమయంలో ఇరు వైపులా సైన్యం ఎటువంటి తుపాకులు ఉపయోగించలేదు. కానీ.. ఈ దాడి కోసం చైనా సైనికులు ఇనుప చువ్వలు బిగించిన ఇనుప రాడ్లను వాడినట్టు తెలుస్తోంది.

 

 

ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్‌ శుక్లా ఈ ఆయుధాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఉంచారు. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన ఇనుప చువ్వలను వెల్డింగ్‌ చేసి ఉన్న ఫోటోలను ఆయన బయటపెట్టారు. గల్వాన్‌ ఘర్షణ జరిగిన ప్రాంతంలో భారత సైనికులు ఈ ఫోటోలు తీసినట్లు రక్షణ రంగ నిపుణులు అజయ్‌ శుక్లా తెలిపారు. ఈ అనాగరిక చర్యను అజయ్‌ శుక్లా తీవ్రంగా ఖండించారు.

 

 

దీన్ని సైనికచర్య అనడం సరికాదన్న ఆయన ఇదో నేరపూరిత చర్యగా వర్ణించారు. ఈ ఇనుప చువ్వలు వెల్డింగ్‌ చేసివున్న తీరు చూస్తే.. చైనా సైనికులు ముందస్తు ప్రణాళికతోనే భారత సైన్యంపై ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇదే దాడిలో ఎంత మంది చైనా సైనికులు మరణించారన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: