తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంది. గత కొన్ని రోజుల నుండి 200కు పైగా కరోనా కేసులు నమోదుకాగా నిన్న ఏకంగా ట్రిపుల్ సెంచరీని క్రాస్ చేసింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో  352 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో కేవలం జిహెచ్ఎంసిలోని 302 కేసులు నమోదయ్యాయని  రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే టెస్టులు ఎన్ని చేసిందో  మాత్రం హెల్త్ బులిటెన్ లో వెల్లడించలేదు. ఈ కొత్త కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం 6027 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 3301మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం 2531కేసులు యాక్టీవ్ గా వున్నాయి. కాగా నిన్న కరోనా తో ముగ్గురు మరణించగా మొత్తం మరణాల సంఖ్య195కు చేరింది.  

ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 13000 కుపైగా కేసులు నమోదుకావడం గమనార్హం. ఇందులో అత్యధికంగా మహారాష్ట లో 3752, ఢిల్లీ లో 2877 ,తమిళనాడులో 2141 ,ఉత్తర ప్రదేశ్ లో 630 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు దేశం లో 381000 కరోనా కేసులు నమోదు కాగా 13000 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 200000 మంది బాధితులు కోలుకున్నారు. ఇక 120504 కేసుల తో మహారాష్ట్ర , దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు,ఢిల్లీ తరువాతి స్థానాల్లో వున్నాయి. మరో 11 రోజులో లాక్ డౌన్ 5.0 కూడా పూర్తికానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: