చంద్రబాబు రాజకీయ వారసుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యవహార శైలి లో కొద్దిరోజులుగా చాలా మార్పు కనిపిస్తుంది. అన్ని విషయాలలోనూ తలదూర్చి, పార్టీ బరువు బాధ్యతలను తలకెత్తుకుని కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు. అసలు లోకేష్ లో ఇంత అకస్మాత్తుగా మార్పు ఎందుకు వచ్చింది  ? ఎలా వచ్చింది అనేది అందరికీ ఆసక్తిగా మారింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలో కీలక నాయకులు అనుకున్న వారంతా అనేక అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్తున్నారు. మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో పార్టీని ముందుకు నడిపించే నాయకుడు అవసరం చాలా . అదీకాకుండా చంద్రబాబు వయసు పైబడటం, ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీ రథసారథి ఎవరు అనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

IHG


బాబు రాజకీయ వారసుడిగా లోకేష్ ఉన్నా... మెజారిటీ టిడిపి నాయకులు లోకేష్ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆయన కాకుండా వేరే ఎవరికైనా పార్టీ పగ్గాలు అప్పగిస్తే టీడీపీ బతికి బట్టకట్టగలదని, లోకేష్ పార్టీని నడిపించగల శక్తీ, సామర్ధ్యాలు లేవనే వ్యాఖ్యలు లోకేష్ చెవిన పడ్డాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా పదే పదే తెరమీదకు రావడం, తెలుగుదేశం పార్టీలో ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తేనే మళ్లీ తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని, లేకపోతే వైసీపీ దూకుడు చర్యలతో వచ్చే ఎన్నికల నాటికి ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఇలా అనేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో తాను ఈ సమయంలో యాక్టివ్ గా ఉండకపోతే చాలా నష్టపోతానని, పార్టీ నాయకులకు నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించకపోతే ఆ తర్వాత రాజకీయంగా, సొంత పార్టీ నాయకులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అనుమానం లోకేష్ లో కలిగినట్టు గా కనిపిస్తోంది.

IHG


 అందుకే ఇప్పుడు చంద్రబాబు స్థాయిలో అన్ని కార్యక్రమాలను, ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలోనూ, శాసనమండలిలో యాక్టివ్ గా ఉంటూ కనిపించడం, ఇవన్నీ ఇప్పుడు చూడడానికి కాస్త కొత్తగా కనిపిస్తుంది. అదీకాకుండా లాక్ డౌన్ సమయం లో లోకేష్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారని, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా గతం కంటే ఇప్పుడు బాగా మారిందని, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు తనపై ఉన్న అపోహలు, నిందలు అన్ని తొలగించుకుని తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా మారాలనే ప్రయత్నాల్లో లోకేష్ ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో వాతావరణం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: