రామాయణంలో తండ్రి దశరధుడి మాట విని రాముడు పద్నాలు సంవత్సరాలు వనవాసం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ కాలంలో అంటే తండ్రిమాటకు గౌరవం ఇచ్చేవారు.. తండ్రి మాట జవదాటని కుమారులు ఉన్నారు.. కానీ ఈ కాలంలో తండ్రి మాట అంటే ఛ.. ఛీ.. అనుకునే వారే చాలా మంది ఉన్నారు.  కానీ ఓ యువకుడు మాత్రం తన తండ్రి మాట కోసం.. ఆయన సంతోషం కోసం ఎంత పని చేశాడో తెలుసా.  పెళ్లంటే ఒక్కసారే చేసుకుంటారు.. జీవితాంతం గుర్తుండిపోయేలా జరగాలంటారు. అందుకే పేదవాడైనా సరే తన తాహతకు మించి పెళ్లి తంతు జరిపిస్తారు.. ఇక ఉన్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలే తరాలు మాట్లాడుకునేలా జరిపిస్తారు.  పెళ్లి అంటే నూరేళ్ల పంట. జంట కలకాలం కలిసి జీవించాలని దీవిస్తూ ఉంటారు.

 

వధూ వరులు కూడా తమకు కాబోయే వ్యక్తి గురించి రకరకాల ఊహల్లో మునిగిపోతారు.  అయితే ఆ యువకుడు కూడా పెళ్లి చేసుకున్నాడు.. కానీ మనిషిని కాదు.. ఓ దిష్టిబొమ్మను పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఘనంగా దిష్టిబొమ్మను పెళ్లి చేసుకోవడమే కాదు.. వచ్చిన అతిథులకు భోజనాలు కూడా పెట్టించారు.   ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ వివాహం గురించి అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.  ప్రయాగ్ రాజ్‌కు చెందిన శివమోహన్(90)కు తొమ్మిది సంతానం. పెద్దవాళ్ల  వాళ్లందరికి పెళ్లిలు చేశాడు.

 

తన చిన్న కొడుకు పెళ్లి చూడకుండానే చనిపోతానా అన్న బాధతో ఉన్నాడు. తండ్రి బాధ చూసిన తనయుడు తండ్రి మాట కోసం ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తా అన్నాడు.  అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నందున ఎవరూ పిల్లను ఇచ్చేందుకు ముందుకురాలేదు. ఇక చేసేదేమి లేక ఓ దిష్టిబొమ్మను తయారు చేసి చీరకట్టి పెళ్లి పీటలపై కూర్చొబెట్టి తాళి కట్టించాడు. ఇదేం పెళ్లని మొదట పంచరాజ్ ఈ పెళ్లిని తిరస్కరించాడు. చివరకు తండ్రి కోరిక కాదనలేక ఆ బొమ్మను పెళ్లి చేసుకోవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: