దేశంలో కరోనా వైరస్ ప్రబలి పోతుంది.. జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ భయంకరమైన వైరస్ కి వ్యాక్సిన్ లేదు అని నెత్తీ నోరూ బాదుకుంటూ ప్రతిరోజూ చెబుతూనే ఉన్నారు. కానీ కొంత మంది నిర్లక్ష్యం వందల... వేల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.  కరోనా ఒకరి నుంచి ఒకరికి వెంటనే సోకుతుందని.. సాద్యమైనంత వరకు దగ్గరగా ఉండకుండా.. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని.. శానిటైజర్ వాడాలని.. మాస్క్ ధరించాలని అంటున్నారు. తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరి ద్వారా ఏకంగా 222 మంది కరోనా వైరస్ బారినపడ్డారు.  జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గత నెల 21న తొలి పాజిటివ్ కేసు నమోదైంది.

 

ఉన్నట్టుండి అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.. దాంతో వైద్యులకు అనుమానం వచ్చింది. ఇప్పటి వరకు 222 మందికి వైరస్ సంక్రమించింది. ఒక్క మామిడాడలోనే ఏకంగా 119 మంది వైరస్ బారినపడడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.  అంతేకాదు  అలాగే, పెద్దపూడి మండలంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 125కు పెరిగింది. అసలు విషయానికి వస్తే.. మామిడాడలో నమోదైన తొలి కేసు ద్వారా రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ పరిధిలోని సూర్యారావుపేట లో 57 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. 

 

ఆ ఒక్క కేసు ద్వారా మిగతా వారందరికీ సంక్రమించినట్టు అధికారులు తెలిపారు.  కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 13,923 శాంపిళ్లను పరీక్షించగా మరో 299 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 77 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: