ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 4గంటలవరకు ఎన్నికలు జరుగనున్నాయి. 5గంటలకు ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఇందుకుగాను వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో 4, గుజరాత్‌లో 4, రాజస్థాన్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 3, ఝార్ఖండ్‌లో 2, మణిపూర్‌, మిజోరం, మేఘాలయాల్లో ఒక్కో స్థానానికి  ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ బరిలో ఉండగా… టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు.

 

టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య బరిలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత చంద్రబాబు విప్ జారీ చేశారు.  పార్టీకి దూరంగా ఉంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేశారు. ఇదిలా ఉంటే.. అభ్యర్థి వర్ల రామయ్యకు ఏజెంట్‌గా ఎమ్మెల్సీ అశోక్‍బాబును, పార్టీ తరపున ఏజెంట్‍గా మాజీ మంత్రి ఆలపాటిని నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో 4, గుజరాత్‌లో 4, రాజస్థాన్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 3, ఝార్ఖండ్‌లో 2, మణిపూర్‌, మిజోరం, మేఘాలయాల్లో ఒక్కో స్థానానికి  ఎన్నికలు జరుగుతాయి.

 

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది.  పోలింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టీ మొత్తం నాలుగు స్థానాలను అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: