చైనా మరింత బరి తెగించింది. గాల్వన్ వ్యాలీ భూభాగంపై సార్వభౌమాధికారం తమదేనని ప్రకటించింది. భారత సైన్యం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తోందని బుకాయించింది. తమ సైన్యాన్ని అదుపులో పెట్టుకోవాలని భారత్​ ను కోరుతున్నామంది. సరిహద్దుపై వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పేర్కొంది. చైనా భూభాగంలోనే ఘర్షణ జరిగిందని.. ఇందుకు తమను బాధ్యులను చేయొద్దని వ్యాఖ్యానించింది. సమస్యను పరిష్కరించేందుకు దౌత్య, సైన్యాధికారుల స్థాయిలో భారత్​తో మాట్లాడుతున్నట్లు చెప్పింది.

 


అతిశీతల ప్రాంతంలో సైనికులు దేశ రక్షణ కోసం గట్టిగా భాగంగా ఆ ప్రాంతం లో ఉండగా. చైనా సైనికులు కవ్విస్తూ చేస్తున్న చర్యలలో భాగంగా చెలరేగిన ఈ ఘటనలో రక్షణ రంగ ఒప్పందాలు ప్రకారం బోర్డర్లో ఇటువంటి మారణాయుధాలు ఉపయోగించకూడదని చేసుకున్న ఒప్పందాలను మరిచి, వాటిని ఉల్లంఘిస్తూ ఇనుప రాడ్ తో కూడిన ఒక  ఆయుధాన్ని మేకులతో అమర్చి భారతీయ సైనికుల పై దాడి చేశారు. దీనికి భాగంగానే మన సైనికులు వీరమరణం పొందారు.

 

ఇరు దేశాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ సరిహద్దుల మధ్య ఉన్నా ఒప్పందాలను మరువకూడదని, సరిహద్దుల్లో ఉన్న సైనికులు అటు వైపు ఉన్న పరాయి దేశాల సైనికుల మీదకు ఆయుధాలతో బరితెగింపు చర్యలు చేయకూడదని ఎన్నో ఒప్పంద పత్రాల లో సంతకాలు చేసుకున్నప్పటికీ ఈ బరితెగింపు ఎవరు సమాధానం చెప్పాలో స్పందించకపోవడం అమానుషంగా మిగిలింది. ఈ మెకులతో కూడిన ఇనుప రాడ్లు ను ట్విట్టర్ వేదికగా రక్షణ రంగ అధికారులు విడుదల చేశారు.

 


వారు ఇది ఎంతో అమానుష చర్య గా పేర్కొన్నారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఇటువంటి చర్యలను చేయడం ఈ దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన చర్యలకు భంగం వాటిల్లుతుందని ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశానికి ఇదే నాంది పలుకుతుందని పేర్కొన్నారు.భారతీయ సైనికులు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకుండా వాదన చేసిన చైనా సైనికులు ఇనుపరాడ్లతో దాడి చేసి  ఇంత మంది సైనికులను మన దేశానికి దూరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: