భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత సైనికులు మ‌ృతి చెందారు.  ప్రస్తుతం భారత్ - చైనా మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  మొన్న జరిగిన దాడిలో మన సైనికులు ఇరవై మంది అమరులైన విషయం తెలిసిందే.  అయితే ఇదంతా డ్రాగన్ పక్కా ప్రణాళికతో చేసిన దాడి అని.. దానికి ధీటుగా భారత సైన్యం జవాబు ఇచ్చే క్రమంలోనే అమరులయ్యారని తెలిసిందే. లాద్ధాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఇదే క్రమంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ పెద్దగా మారింది. దీంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు.

 

కాగా, తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చైనా అదుపులోకి తీసుకున్న 10 మంది భారత సైనికులను ఆ దేశం విడిచిపెట్టింది. అయితే ఈ విడుదలకు ముందు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత సైనికులను చైనా విడుదల చేసింది. వారిలో ఓ లెఫ్టినెంట్‌ కల్నల్, ముగ్గురు మేజర్లు కూడా ఉన్నారు.

 

ఇటీవల జరిగిన ఘర్షణలో మొత్తం 76 మంది భారత సైనికులు గాయాలపాలైనట్లు తెలిసింది. వారిలో చాలా మంది ఇప్పటికే కోలుకున్నారు. అయితే చైనా కుటిల నీతికి జవాబుగా చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: