భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 13,586 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 336 మంది మరణించారు.  లాక్‌డౌన్ ముగిసి అన్ లాక్ మొద‌ల‌వ్వ‌డంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా… 24 గంటల్లో 13,586 మందికి క‌రోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఒక రోజు వ్యవధిలో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొద‌టిసారి. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,80,532కి చేరింది. 

 

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 163248గా ఉంది. ఇక కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 12,573కు చేరింది. దేశవ్యాప్తంగా వ్యాధి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 2,04,710 మంది కోలుకున్నారు.  ఇదిలా ఉంటే కరోనా మొదలైనప్పటి నుంచి ఎక్కువగా దీని ప్రభావం మహారాష్ట్ర పై పడింది.  అమెరికాలోని న్యూయార్క్ పరిస్థితి ఇక్కడ నెలకొందని అంటున్నారు. వరుసగా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి.  ఇప్పటివరకు అక్క‌డ‌ 1,20,504 కేసులు నమోదయ్యాయి. 5751 మంది క‌రోనాతో చనిపోయారు.

 

దేశ రాజధాని ఢిల్లీ క‌రోనా కేసుల విష‌యంలో సెకండ్ ప్లేసులో ఉంది. కోవిడ్-19 కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు 1969 మంది అక్క‌డ ప్రాణాలు విడిచారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోనూ భారీగానే క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. నేడు అఖిలపక్ష సమావేశంలో పీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: