వైసీపీ అసంతృప్త ఎంపీ రఘు రామకృష్ణమ రాజు ని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్.. ఇప్పుడు ఇదే విష‌యం వైసీపీ వ‌ర్గాల్లో బాగా వైర‌ల్ అవుతోంది. కొద్ది రోజులుగా జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారిన ఆయ‌న్ను రాజ్యసభ ఓటింగ్ వ్యవహారం పూర్తయిన తరువాత ఎంపీ పై సస్పెన్షన్ వేటు వేసేందుకు స్కెచ్ అంతా సిద్ధం చేశార‌ని అంటున్నారు. తెగే వరకూ లాగడమే సస్పెన్షన్ కి కారణం అని వైసీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక పై నుంచి ఎన్ని వార్నింగ్లు వ‌చ్చినా కూడా ర‌ఘురామ కృష్ణంరాజు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. 

 

ఎంపీ రఘు రామకృష్ణమ రాజు దిష్టి బొమ్మలు తగలబెట్టిన నాయకులు, కార్యకర్తల పై సంబంధిత పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేసినా.... కేసు నమోదు చెయ్యడానికి స్థానిక పోలీసులు నిరాకరించడంతో కోర్టు ని ఆశ్రయించేందుకు ఆయ‌న రెడీ అవుతున్నారు. ఇక వైసీపీ అధిష్టానంపై, స్థానిక సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పైనే ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేల అనుచ‌రులు, కేడ‌ర్ ఎంపీ దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేశారు. దీంతో ఆయ‌న పోలీస్ స్టేష‌న్లో కేసులు పెట్టినా స్థానిక పోలీసులు ఎమ్మెల్యేల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి కేసులు పెట్ట‌లేద‌ని టాక్‌..?

 

ఈ క్ర‌మంలోనే ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించేందుకు రెడీ అవుతున్నార‌న్న విషయం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న అధిష్టానం ఎంపీ పై వేటుకి సిద్ధం అయ్యింది . అయితే ఎంపీ రఘు రామకృష్ణమ రాజు కి కూడా సస్పెన్షన్ పై ఉప్పు అందడంతో బిజెపి అధినాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. వాస్త‌వంగా చెప్పాలంటే ఆయ‌న గ‌త ఐదారేళ్లుగా బీజేపీతో స‌న్నిహిత సంబంధాలు నెర‌పుతూ వ‌స్తున్నారు. సస్పెన్షన్ అనంతరం తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలపై స్పష్టమైన అవగాహనతో ఆయ‌న ముందుకు వెళుతున్నార‌ట‌. బీజేపీ ఆపరేషన్ సౌత్ లో రఘు ఎపిసోడ్ మొదటిదే అని ఇంకా పెద్ద సినిమా ఉంది అన్న చ‌ర్చ‌లు కూడా జాతీయ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: