దేశంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకువచ్చింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే మోదీ సర్కార్ ఈ పథకం కింద అన్నదాతలకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తోందన్నారు. ఈ పథకాన్ని మూడు విడతల్లో రూ.2,000 చొప్పున ఈ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమవుతాయని తెలిపారు.

 

 

పీఎం కిసాన్ స్కీమ్ కింద దాదాపు 10 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటిదాకా రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వచ్చి చేరాయన్నారు. అయితే ఇంకా ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరాలని భావిస్తే.. ఇప్పుడు కూడా చేరొచ్చునన్నారు. పీఎం కిసాన్ డబ్బులు పొందొచ్చునని తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఇప్పుడే అంటే జూన్ నెలలో చేరితే ఈ నెలలో లేదా జూలైలో రూ.2,000 డబ్బులు పొందొచ్చునన్నారు. తర్వాత ఆగస్ట్ నెలలో కూడా మరో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు రూ.2,000 అకౌంట్‌లోకి వచ్చి చేరతాయన్నారు. అంటే రెండు నెలల్లోనే రూ.4,000 పొందొచ్చునన్నారు.

 

 

పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఇంటి వద్ద నుంచే ఆ పని పూర్తి చేసుకోవచ్చునన్నారు. దీని కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇందులో ఫార్మర్స్ కార్నర్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత న్యూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలన్నారు. మీ ఆధార్ కార్డు, క్యాప్చా వంటివి ఎంటర్ చేయాలి. కంటిన్యూపై క్లిక్ చేయాలి. తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుందన్నారు. యస్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ మరో పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్, ఐఎస్ఎఫ్‌సీ కోడ్, భూమి రిజిస్ట్రేషన్ నెంబర్ వంటివి ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: