సముద్రంలో మనుషులకు తెలియని ఎన్నో వింతైన చేపలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇలాంటి చేపలు దొరుకుతూ ఉంటాయి దీంతో వెంటనే వీటిని... క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారిపోతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఒక వింత అరుదైన చేప కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చేప ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. 

 


 ఇంతకీ ఈ చేప ఎక్కడ దొరికింది అంటారా... అది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే... యూకేలోని పోర్ట్ ల్యాండ్ హార్బర్ సమీపంలో మోలా మోలా అని పిలిచే అరుదైన పెద్ద సముద్రపు చేప ఇది. డోర్సేట్  తీరంలో సజీవంగా ఉన్న అత్యంత అరుదైన పెద్దదైన చేపని మత్స్యకారులు గుర్తించారు. దీనిని మత్స్యకారులు బోని  ఫిష్  అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా అయితే కేవలం ఉష్ణమండల జలాల్లో మాత్రమే ఇలాంటి అరుదైన చేపలు సంచరిస్తూ ఉంటాయి. ఈ చేప బరువు ఏకంగా 2.3 టన్నులు. 

 

 ఈ చేప ఏకంగా పది అడుగుల పొడవు ఉంది... ఇక ఈ చేప కు సంబంధించి ఒక ఫోటో ని మరియన్  కన్జర్వేషన్ సొసైటీ వారు ట్విటర్లో పోస్ట్ చేసి... గ్రహం మీద సజీవంగా ఉన్న అతిపెద్ద బోని ఫిష్ అని.  జెల్లీ ఫిష్ లను తినడానికి వేసవికాలంలో యూకేకి వచ్చింది అంటూ కామెంట్ పెట్టారు. ఇక ప్రస్తుతం ఈ చేప కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది ఈ ఫోటో. ఈ చేపను  చూసి అటు నెటిజన్లు కూడా కాస్త ఆశ్చర్యపోతున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: