ఇటీవల చాలా మంది భర్తలు పెళ్లి చేసుకుని కూడా భార్య సంపాదనపై ఆధారపడి సోమరులుగా బతుకుతున్నారు. దీంతో విచ్చలవిడి జీవితానికి అలవాటుపడిన ఓ వ్యక్తి తన భార్య తో వేరొక వ్యక్తి లాగా రొమాంటిక్ చాట్ చేసి కోటి రూపాయలు నొక్కేసాడు భర్త. ఈ సంఘటన గచ్చిబౌలిలో వెలుగులోకి వచ్చింది. భార్యతో భర్త స్నేహితుడి లాగా చాటింగ్ చేసి తన భార్య దగ్గర కోటి రూపాయలు నొక్కేసాడు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ కి కరీంనగర్లో ఉంటున్న సంతోష్ కుమార్ కి మాట్రిమోనియల్ సైటు ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావడంతో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. భారీ స్థాయిలో సంతోష్ కుమార్ తన అత్తగారి ఇంటి నుండి కట్న కానుకలు అందుకోవడం జరిగింది.

 

అయితే వివాహం అయిన తర్వాత సదరు మహిళ కి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉద్యోగం రావడంతో...ఇక్కడే ఉండిపోయి నా భర్త సంతోష్ కుమార్ తన అవసరాలకు గాన రకరకాల కారణాలు చెప్పి భార్య దగ్గర 63 లక్షలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా తన స్నేహితుడి పేరు సత్య హర్ష రెడ్డి అనే పేరుతో భార్య మొబైల్ మరియు మెయిల్ కి అసభ్యకరమైన సందేశాలు మరియు వీడియోలు పంపే వాడట.

 

దీంతో మిత్రుడు పేరుతో భార్యకు అశ్లీల వీడియోలు ఫోటోలు రావటంతో భర్తకి అనుమానం వచ్చి గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసింది.  దీంతో విచారణ స్టార్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు భర్త సంతోష్ కుమారే, సత్యహర్ష రెడ్డి అనే పేరుతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపినట్టు తేలింది. వెంటనే సంతోష్ కుమార్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: