ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఒకపక్క కరోనా వైరస్ ఎదుర్కోటానికి వ్యాక్సిన్ లు మరియు డ్రగ్ గురించి పరిశోధనలు వార్తలు వస్తున్న గాని మరోపక్క...కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది బయట పడటం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా జర్మనీలో నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలో ఓ కబేళాకి చెందిన 730 మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డట్లు ఆ ప్రాంతానికి చెందిన అధికారులు తెలిపారు. ఈ దెబ్బతో గిటరహ్ స్లో జిల్లా లోని టోనీస్ గ్రూప్‌ మీట్ ప్యాకింగ్ ప్లాంట్‌ను తాత్కాలికంగా నో చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆ సంస్థకు సంబంధించిన ఏడువేల మంది ఉద్యోగస్తులను క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మాంసం విక్రయించిన ప్రాంతాలలో ఈనెల 29వ తేదీ వరకు స్కూళ్లు, డేకేర్ కేంద్రాలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

 

మరో 5 వేల మందికి పైగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అసలు వైరస్ ఎలా ప్రవేశించింది అన్నదానిపై అధికారులు మరియు ప్రభుత్వం విచారణ చేపట్టింది. మొత్తంమీద జర్మనీలో ఈ మాంసం ప్యాకింగ్ చేసే సిబ్బందికి దాదాపు 730 మందికి కరోనా పాజిటివ్ రావటంతో ఈ వార్త దేశాన్ని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేసింది. మరోపక్క ఈ సంస్థ నుండి మాంసం విక్రయించిన ప్రాంతాలలో వీలైనంత త్వరగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువ చేయాలని ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది.

 

మరోపక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ డిసెంబర్ చివరికల్లా జరుగుతున్న పరిశోధనల్లో ఏదో ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటూ ఒక సరికొత్త న్యూస్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో WHO ప్రకటించిన ప్రకటనకు ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: