మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని డైరెక్ట్ గా చూసారా..!అసలు మన పక్కన దెయ్యం ఉందని ఎలా తెలుస్తుంది.సినిమాలలో చూపించినట్టే దెయ్యాలు ఉంటాయా , అవి మన దగ్గరకు వచ్చినపుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుందా.దెయ్యం వచ్చినపుడు ఎలాంటి సంకేతాలు వస్తాయి , వాటిని మనము ఎలా గుర్తించాలి ?అవన్నీ తెలియాలి అంటే ఈ విషయాలు మీరు చదవాల్సిందే.....

 

దెయ్యం మన దగ్గరకు వచ్చినపుడు ఈ సంకేతాలు వస్తాయంట...

 

 1. దెయ్యం మ‌న ద‌గ్గ‌రే ఉందని చెప్ప‌డానికి ప్ర‌ధాన చిహ్నం.. చిన్న‌పాటి శ‌బ్దాలు.. వాటిని విన‌గ‌లిగితే దెయ్యం మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు తెలుస్తుంది. అంతా ప్ర‌శాంతంగా, నిశ్శ‌బ్దంగా ఉన్న‌ప్పుడు వింతైన చిన్న, చిన్న శ‌బ్దాలు వ‌స్తుంటే.. వాటిని ఎవరైనా వింటే.. అప్పుడు దెయ్యం ఉన్న‌ట్లు భావించాలి.

 

 2. దెయ్యాలు ఇంట్లో ఉంటే.. కుక్క‌, పిల్లి లాంటి పెంపుడు జంతువులు చిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుంటాయ‌ట. అలాంటి సూచ‌న‌లు క‌నిపిస్తే దెయ్యం ఉన్న‌ట్లు అర్థం చేసుకోవాలి.

 

 3. ఇంట్లో ఉండే కుర్చీలు, టేబుల్స్‌, తాళం చెవులు.. త‌దిత‌ర వ‌స్తువులు మీరు ఉంచిన చోట కాకుండా వేరే చోట క‌నిపిస్తున్నాయా ? ఇత‌రులెవ‌రూ వాటిని క‌నీసం ట‌చ్ కూడా చేయ‌డం లేదా ? అయితే అది నిజంగా దెయ్యాల ప‌నే.

 

 4. మారిన్ హాంకాక్ అనే ఓ దెయ్యాల స్పెష‌లిస్టు చెబుతున్న ప్ర‌కారం.. అర్థ‌రాత్రి 3 నుంచి తెల్ల‌వారుజామున  5 గంట‌ల వ‌ర‌కు దెయ్యాల ప‌వ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఆ స‌మ‌యంలో గ‌న‌క మీకు నిత్యం మెళ‌కువ వ‌స్తుంటే.. అది దెయ్యాల ప‌నే అని గ్ర‌హించాల‌ట‌. ఇది కూడా మీ ద‌గ్గ‌ర దెయ్యం ఉంద‌ని చెప్ప‌డానికి ఒక నిద‌ర్శ‌న.

 

 5. దెయ్యాలు నివాసంలో ఉంటే.. అందులో ఉండే వారి శ‌రీరంపై రక్కిన‌ట్టు గాయాలు అవుతాయ‌ట‌. రాత్రి పూట అయ్యే ఈ గాయాలు తెల్ల‌వారు జామున లేచి చూస్తే క‌నిపిస్తాయి. కానీ ఆ గాయాలు ఎలా అయ్యాయో తెలియ‌ద‌ట‌.

 

 6. పీడ‌క‌ల‌లు బాగా వ‌స్తుంటే ఇంట్లో దెయ్యం ఉన్న‌ట్లు భావించాల‌ట‌.

 

 7. మీ ద‌గ్గ‌ర ఉన్న ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులైన టీవీ, స్మార్ట్‌ఫోన్‌, కంప్యూట‌ర్ త‌దిత‌ర వ‌స్తువులు డిస్ట‌ర్బెన్స్‌ను ఎదుర్కొంటే దెయ్యం ఉన్న‌ట్లు భావించాల‌ట‌.

 

 8. దెయ్యం ఉంటే ఆ నీడ‌లు బాగా క‌నిపిస్తాయ‌ట‌. కానీ చూస్తే మ‌నుషులెవ‌రూ ఉండ‌రు. ఇది దెయ్యం ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌నం.


 
 9. గదిలో ఉష్ణోగ్ర‌త దానిక‌దే ఇష్టం వ‌చ్చిన‌ట్లు మారుతుంటే దెయ్యం ఉంద‌ని భావించాల‌ట‌.

 

 10. దెయ్యాల స్పెష‌లిస్టు మారిన్ హాంకాక్ చెబుతున్న ప్ర‌కారం.. ఇంట్లో దెయ్యం ఉంటే రాత్రి పూట‌ గ‌డియారంలో టైము 11:11 అయిన‌ప్పుడు మీరు దాని వంక ఆటోమేటిక్‌గా చూస్తార‌ట‌.

 

11. మిమ్మ‌ల్ని ఎవ‌రో చూస్తున్న‌ట్లు, మీతో మాట్లాడాల‌ని వారు అనుకుంటున్న‌ట్లు మీకు భావ‌న క‌లిగినా.. అది దెయ్యం ఉంద‌న‌డానికి బ‌ల‌మైన చిహ్న‌మ‌ట.

 

12. దెయ్యాలు తాము మాట్లాడాల‌నుకునే వారిని ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి చిన్న‌గా పిలుస్తాయ‌ట‌. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని పిలిచిన‌ట్లు చిన్న‌గా శ‌బ్దం వ‌స్తే అది దెయ్యం ప‌నే.

 

13. మీ చుట్టూ ఉన్న ప‌రిస‌రాల్లో నుంచి అద్భుత‌మైన సువాస‌న వ‌స్తుంది. కానీ అది ఎక్క‌డి నుంచి వ‌స్తుందో తెలియ‌కపోతే అది కూడా దెయ్యం ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ట.

మరింత సమాచారం తెలుసుకోండి: