ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా  వైరస్ రోజురోజుకు పంజా విసురుతుంది. శరవేగంగా వ్యాప్తిచెందుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని చూస్తూ ఉంటే ఎంతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిరోజు పదివేలకు పైగా కొత్త కరోనా  కేసులు నమోదు అవుతుండటంతో  భారతదేశంలో కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మరింతగా పెరిగిపోయింది. 

 

 అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుండి ప్రాణాలను లెక్కచేయకుండా కుటుంబం గురించి కూడా మరచిపోయి నిర్విరామంగా శ్రమిస్తున్నారు వైద్యులు. కరోనా  సంక్షోభంలో వైద్యుల చేస్తున్న సేవ వెలకట్టలేనిది అని చెప్పాలి . చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయి అని  తెలుసు... కుటుంబం ఒంటరి అవుతుంది అని తెలుసు... అయినప్పటికీ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు డాక్టర్ లు . కుటుంబాలకు దూరంగా ఉండి మరీ కరోనా పేషెంట్లకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. 

 

 ప్రస్తుతం కరోనా వైరస్ పేషెంట్ లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు  పిపిఈ  కిట్లు ఇస్తున్నప్పటికీ కరోనా రాదు  అనే గ్యారంటీ మాత్రం లేదు. ఒక వేళ కరోనా  సోకితే ప్రాణం మీదికి వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే కరోనా వైరస్ చికిత్సలో భాగంగా డాక్టర్లు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటూ చికిత్స అందిస్తున్నారు ఎంత కష్ట పడుతున్నారు అనే తెలిపే విధంగా చతిస్ ఘడ్  కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరోనా  వైరస్ పేషెంట్ కు చికిత్స అందించడంలో 10 గంటల డ్యూటీ చేసిన డాక్టర్ పిపీఈ కిట్లు, గ్లౌజులు తీసేసిన తర్వాత అతని చెయ్యి ఎలా మారిపోయింది చూడండి అంటూ పోస్ట్ చేశాడు  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: