ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది కరోనా వైరస్ భయంకరంగా చాలా దేశాలలో ఆర్థిక రాష్ట్రాన్ని మరియు ప్రాణ నష్టాన్ని విధించి భారీగానే డ్యామేజ్ చేసింది. ఒక్క సారిగా మానవ జీవితంలో అనూహ్యమైన మార్పులను తీసుకు వచ్చింది కరోనా వైరస్. మొదటిలో ఈ వైరస్ అమెరికా మరియు యూరప్ దేశాలలో తన ప్రభావం బాగా చూపించి అనేక మందిని బలి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న కొద్ది వైరస్ ప్రభావం పెరుగుతూ ఉంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ నుండి తప్పించుకోవటానికి లాక్ డౌన్ ప్రకటించిన పెద్దగా ఫలితాలు ఏమీ లేకపోవడంతో చాలా వరకు లాక్ డౌన్ విధించిన దేశాలు ఎత్తివేయడం జరిగింది.

IHG

ఈ పరిణామంతో వైరస్ ప్రభావం మళ్లీ ప్రస్తుతం పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేసిన దేశాలు అమలు చేయాలి అని డిసైడ్ అవుతున్నాయి. దీంతో మహమ్మారి కరోనా వైరస్ అడ్డుకట్ట వెయ్యటానికి వ్యాక్సిన్ ఒకటే మార్గమని అన్ని దేశాల ప్రజలు మరియు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ దేశాలు మరియు యూనివర్సిటీల అధ్యాపకులు ఇంకా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

IHG

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ గురించి ఊరటనిచ్చే ఒక వార్త ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడారు. ఈ ఏడాది చివరికల్లా కోవిడ్‌కి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందన్న ఆశాభావంతో డబ్ల్యూహెచ్‌ఓ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కరోనాకు అడ్డుకట్టే వేసే క్లినికల్ ట్రయల్స్‌కి సంబంధించిన ఓ ప్రయోగం మూడో దశకు చేరుకున్నట్లు సౌమ్య తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: