తెలంగాణ ఆర్టీసీకి కార్గో సర్వీసులు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. గూడ్స్ సర్వీసుల్లో నూతన శకానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టబోతోంది. కార్గో, పార్శిల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యమే నడిపిస్తోంది. బస్ స్టేషన్ లో  పార్శిల్ సంస్థను రద్దు చేసింది. ఇటీవలే కార్గో, పార్శిల్ సర్వీసులు మొదలుపెట్టేసింది టీఎస్ ఆర్ టీసీ.

 

లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోయిన ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు టీఎస్ ఆర్ టీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కొద్ది నెలల క్రితం కార్గో సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా సేవలను ప్రారంభించి..అందుబాటులోకి తీసుకొస్తారని భావించారు. అయితే ..కొన్ని పరిస్థితుల కారణంగా కార్గో సేవలను ప్రారంభించలేదు. ఇంతలో ధాన్యం కొనుగోలు సీజన్ మొదలైంది. దీంతో ఆర్టీసీలో సిద్ధంగా ఉన్న కార్గో బస్సులను ముందుగా అత్యవసర వస్తువుల రవాణా, ధాన్యం తరలింపులకు వినియోగించారు. ఆ తరువాత ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సామాగ్రి తరలింపునకు ఈ వాహనాలనే వాడుతున్నారు.

 

అయితే తాజాగా కార్గో బస్సు ద్వారా ఆదాయం ఆశించిన విదంగానే  వచ్చినట్లు సమాచారం. గతంలో టీఎస్ ఆర్ టీసీ ఆదాయ వనరులు పెంచుకునేందుకు, బస్ స్టేషన్ లో ప్రత్యేకంగా సర్వీసులను నిర్వహిస్తుండేది. ఏయన్ఎల్ లాంటి సర్వీసులు అప్పట్లోనే మొదలయ్యాయి. ఈ పార్సిల్ సర్వీసులతో ఆర్టీసీకి ఏడాదికి 70 లక్షలకు పైగానే ఆదాయం వస్తుండేది. అయితే ప్రస్తుతం ఆర్టీసీనే కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. సిటీలో తొలగించిన 660 మంది సిబ్బందిని కార్గోతో పాటు పార్సిల్ సర్వీసులకు వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏయన్ఎల్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఆర్టీసీ కార్గోతో పాటు పార్సిల్ సర్వీసులతో ఏడాదికి 10 నుంచి 14 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ఆర్టీసీ కార్గోతో పాటు పార్సిల్ సర్వీసులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ కార్గో పార్సిల్ సర్వీసులు ఆపరేషన్స్ చూసేందుకు ప్రత్యేక అధికారిని సైతం నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: