భార్యభర్తల బంధం అంటే ఎంత అపురూపంగా ఉంటుంది.. అయితే ఎంత అన్యోన్య సంబంధం అయినా కొన్ని సార్లు గొడవలు జరగడం సహజం.. దాంతో భార్యా భర్తలు మాట్లాడుకోకుండా ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్దలు, వాదాలు నీటి మీద బుడగలాంటివి అంటారు. కాపురం అన్నాక సవాలక్ష అనుకుంటారు.. పడక మీదకు రాగానే అవన్నీ మరిచిపోయి మళ్లీ కలుసుకుంటారు.  ఓచోట మాత్రం భార్యాభర్తలు గత 20 ఏళ్లుగా మాట్లాడుకోవడం లేదు. ఒకే ఇంట్లో ఉన్నా ఆ, ఊలే తప్ప వారి మధ్య మాటలు లేవు.  కాకపోతే వారి పిల్లలు మాత్రం వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. పెళ్లైన కొత్తలో బాగానే కలిసి ఉన్నా ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత అభిప్రాయ భేదాలు రావడం మాట్లాడుకోకపోవడం జరిగింది. 

 


పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్య తనను నిర్లక్ష్యం చేస్తోందని భర్త ఆమెను అపార్థం చేసుకున్నాడు. దీంతో ఆమెతో నేరుగా మాట్లాడటం మానేశాడు. భార్య ఏదైనా అడిగితే తల ఊపడం లేదా చిన్నగా గొనగడం చేసేవాడు.  ఇలా వారి మాట్లాడని పంతం 20 ఏండ్ల పాటు కొనసాగింది. వారి ముగ్గురు పిల్లలు పెద్దవారు అయ్యారు. అయితే తమ తల్లిదండ్రులను కలిపేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా వారిద్దరు మాత్రం ససేమిరా అనేవారు.  ఇక లాభం లేదనుకొని ఈ జంట పెద్ద కొడుకు యోషీకి ఒక ఉపాయం ఆలోచించాడు.

 


 ఓ టివి ఛానల్ కి తన కుటుంబ పరిస్థితి గురించి చెప్పాడు.. దాంతో వాళ్లు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని ఆ భార్యాభర్తలను కలిపేందుకు సిద్దమయ్యారు. ఆ దంపతులు తొలిసారి ఓ పార్కులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒటౌ ఆ చానల్ ‌తో మాట్లాడుతూ.. ‘నా భార్య, పిల్లలను ఎంతో బాగా చూసుకుంది. ఆ అసూయతోనే ఆమెతో నేను మాట్లాడటం మానేశాను. కుటుంబం కోసం పడిన శ్రమకు నా సతీమణికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇకపై మా మధ్య మౌనం ఉండదు. మాట్లాడుకుంటాం’ అని ఒటౌ చెప్పాడు. 20 ఏండ్ల తర్వాత తొలిసారి భార్య నుద్దేశించి ఒటౌ మాట్లాడటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: