తెలుగుదేశం పార్టీకి మరో గట్టి  ఝలక్ తగిలింది. రాజ్య సభ ఎన్నికల్లో నాలుగు చెల్లని ఓట్లు వచ్చాయి. అందులో మూడు ఓట్లు ఎవరివి అన్నది తెలిసిపోయింది. వారు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి అయితే నాలుగవ చెల్లని నోటు ఎవరిది అన్న చర్చ ఇపుడు పార్టీలో గట్టిగా సాగుతోంది.

 

నిజానికి చంద్రబాబు తన వైపు ఎవరున్నారు. అవతలవైపు ఎవరు ఉన్నారు అన్నది తెలుసుకునేందుకే రాజ్య సభ ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీకి పెట్టిన సంగతి విధితమే. అయితే బాబు ఊహినని విధంగా ఒక కొత్త రెబెల్ పార్టీలోనే ఉన్నాడని పెద్దల సభ ఎన్నిక రుజువు చేసింది. దీంతో ఆ నాలుగవ వెన్నుపోటు వీరుడు ఎవరు అన్నది ఇపుడు పార్టీలో చర్చగా ఉంది.

 

ఆయన కూడా చెల్లని ఓటు ఎందుకు వేశారు. ఆయనకు బాబుతో కలిగిన ఇబ్బంది ఏంటి, పార్టీ పరంగా ఆయన ఎందుకు విభేదిస్తున్నారు. ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ఇక ఆయన ఎవరై ఉంటారన్నది కూడా టీడీపీలో చర్చగా ఉంది. అయితే చాలా మంది ఎమ్మెల్యే  తమ్ముళ్ళ మీద అనుమానాలు ఒక్కసారిగా  పెరిగిపోతున్నాయి. ఇలా చెల్లని నోట్లు వేసి మరీ టీడీపీని చెల్లని పార్టీగా ఆ పార్టీ ఎమ్మెల్యే తమ్ముళ్ళే మార్చ‌డం అవమానంగా ఫీల్ అవుతున్నారు.

 

ఓ విధంగా ఇది టీడీపీ కోరి తెచ్చుకున్న ఓటమి. ఆ పార్టీకి బలం లేదని తెలిసినా పోటీకి దిగి మరింతగా పరువు పోగొట్టుకోవడమే కాకుండా పార్టీలో మరింతమంది రెబెల్స్ ఉన్నారన్న సంకేతాన్ని తానే బయట సమాజానికి తెలియచేసింది. అపరచాణక్యుడు అన్న పేరున్న చంద్రబాబు ఎందుకు ఇలా చేశారన్నది కూడా పార్టీ వారికి అసలు  అర్ధం కావడంలేదు. మొత్తానికి పోటీకి దిగి ఓటమి అన్న దాన్ని మళ్ళీ మళ్ళీ తగిలించుకోవడం ద్వారా టీడీపీ తమ్ముళ్ల నైతిక స్థైర్యాన్ని ఒక్కసారిగా  దెబ్బతీసిందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: