ఈ ఆదివారం ఏర్పడే సూర్యగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈసారి వలయాకారం లో సూర్యగ్రహణం ఏర్పడుతుందని, దీనిని అందరు వీక్షించవచ్చని ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని అంటున్నారు. ఐతే శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో కొన్ని ఆచారాలు పాటించాలని అంటున్నారు. ఈ గ్రహణం ముఖ్యంగా అయిదు రాశులపై చెడు ప్రభావం ఉందని చెప్తున్నారు. శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం చూడామణి నామక సూర్యగ్రహణం తేదీ : 21-06-2020 ఉదయం స్పర్శ కాలం 10 గంటల 24 నిమిషాల నుంచి  కాలం 1 గం. 53 నిమిషాలు  వరకూ కాలం 12 గం.07 నిమిషాల గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 29 నిమిషాలు మృగశిర, ఆరుద్ర నక్షత్రములవారు చూడరాదు. మిథున రాశిలో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది. మిధున, వృశ్చిక, కర్కాటక రాశి వారికీ ఫలం. మకర, సింహ రాశి వారికి శుభఫలం. మిగిలిన రాశులవారికి మధ్యమ ఫలము. ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును. చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును. డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ లో సంపూర్ణంగా కనిపించును.

 


గ్రహణ సమయనియమాలు గ్రహణం రోజు అనగా 21 - 06 -2020 ఆదివారం నాడు ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. ఈ నెల 21 న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరించనుంది. ఆ రోజు వలయాకార (యాన్యులర్ ) గ్రహణం కావడంతో.. సూర్యుడు మండుతున్న ఉంగరంలా వినువీధిన దర్శనమివ్వనున్నాడు. ఉదయం 9.15 గంటలకు మొదలవనున్న గ్రహణం, మధ్యాహ్నం 3.04 గంటలకు ముగియనుంది. పూర్తి గ్రహణం ఉదయం 10.17 గంటల నుంచి మధ్యాహ్నం 2.02 నిముషాల దాకా కనిపిస్తుంది.

 


ఆ తరుణంలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు, సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోలేని పరిస్థితి ఉంటుంది. చంద్రబింబం మూసినంత మేర మూయగా .. దాని చుట్టూ కనిపించే సూర్యబింబం మండుతున్న ఉంగరంలా కనిపిస్తుంది. దీన్నే యాన్యులర్ లేదా వలయాకార గ్రహణంగా పేర్కొంటారు. యాన్యులర్ అనే పదం లాటిన్ లోని యాన్యులస్ అనే పదం నుంచి పుట్టింది. అంటే ఉంగరం అని అర్థం. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. మిగిలిన చోట్ల కేవలం పాక్షిక సూర్యగ్రహణంలాగే కనిపిస్తుంది. ఒక సెకను నుంచి 12 నిముషాల వ్యవధి మధ్యలో ఈ వలయాకార గ్రహణ సమయం ఉండే అవకాశం ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉదయం 8 గంటల వరకు తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: