ఇటీవల భారత్-చైనా సరిహద్దుల వద్ద జరిగిన ఘర్షణలో మరణించిన తెలంగాణ రాష్ట్రానికి  చెందిన కల్నల్ సంతోష్ కుటుంబానికి భారీ ఎత్తున సాయం ప్రకటించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం తరపున కల్నల్ సంతోష్ కుటుంబానికి  భారీ ఎత్తున సహాయం ప్రకటించారు. కల్నల్ సంతోష్ కుటుంబానికి ఐదు కోట్ల నగదు, నివాస స్థలం అదేవిధంగా ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి నుంచి ఉద్యోగం ఇవ్వడానికి రెడీ అయ్యారు.

IHG'Soft-spoken ...

అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా దేశం కోసం ప్రాణం విడిచిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ ఇంటికి స్వయంగా కేసిఆర్ వెళ్ళి సహాయం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక సరిహద్దుల్లో మరియు దేశ రక్షణ బాధ్యత నిర్వర్తిస్తున్న సైనికులకు దేశ ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం మరియు వారి కుటుంబంలో భరోసా నింపినట్లు అవుతుందని సూచించారు.

IHG's final trip between the parade of soldiers ...

ఇటువంటి క్లిష్ట సమయంలో సైనికుల కుటుంబాలకు అండగా ఉంటే సరిహద్దుల్లో దేశం కోసం పనిచేస్తున్న సైనికులలో ధైర్యం ఉంటుందని దేశమంత కుటుంబానికి అండగా ఉంటుంది అన్న మెసేజ్  వారికి చేరుకుంటుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా దాదాపు 45 సంవత్సరాల తర్వాత భారత్ చైనా సరిహద్దు వద్ద మొదటి సారి భారీ ఎత్తున ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో ఖచ్చితంగా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని...యుద్ధానికి అయినా సిద్ధమే అన్నట్టుగా ప్రస్తుతం కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: