నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ మొదలైనప్పటి నుంచి పాజిటివ్ గానే కొనసాగుతూ మొత్తంగా నేటి మార్కెట్ లాభాలతో ముగిసింది. ఒకానొక దశలో ఎనిమిది వందల పాయింట్లకు పైగా వెళ్లిన సెన్సెక్స్ చివరికి 524 పాయింట్ల లాభంతో 34,732 వద్ద, అలాగే 153 పాయింట్లు లాభపడి 10,244 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నేడు దాదాపు అన్ని రంగాలు లాభాల బాట పట్టాయి. వరుసగా రెండు రోజులు లాభాలతో స్టాక్ మార్కెట్ వారాంతంలో మూడు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.

 

IHG


ఇక నేటి స్టాక్ మార్కెట్ విషయాలు చూస్తే...  నిఫ్టీ 50 లో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, రిలయన్స్, భారతీ ఇంఫ్రాటెల్ లాభాల బాట పట్టగా అందులో బజాజ్ ఫిన్ సర్వ్ 8 శాతం పైగా లాభపడింది. ఇక మరోవైపు ఇండస్ ల్యాండ్ బ్యాంక్, వేదాంత, HCL టెక్, ఐటిసి, మహీంద్రా అండ్ మహీంద్రా... కంపెనీలు నష్టాల బాట పట్టాయి. వీటిలో ఇండస్ ల్యాండ్ బ్యాంక్ 3 శాతం పైగా నష్టపోయింది.

IHG

 


ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలరుతో రూపాయి మారకపు విలువ చూస్తే కేవలం పది పైసలు లాభపడి 76.26 వద్ద కొనసాగుతోంది. అలాగే బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 495 రూపాయలు పెరిగి రూ.47, 850 వద్ద ముగిసింది. అలాగే కేజీ వెండి ధర రూ. 874 భారీగా పెరిగింది. దీంతో నేడు వెండి కిలో రూ.48,735 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: