చైనా మీద ఇపుడు భారతీయుల ఆగ్రహం ఒక లెక్కలో ఉంది. చైనా భరతం పడతామని అంటున్నారు. చైనా మీద ఇపుడు అసలే మండిపోతున్నారు. హాయిగా ఉంటూ వస్తున్న భారత్ మీదకి కరోనా వైరస్ మహమ్మారిని పంపించిన చైనా అంటే సామాన్యుడి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ గుర్రుగా ఉంది. ఇపుడు ఏకంగా మన సైనికుల మీద దాడులు చేసి 20 మందిని పొట్టన పెట్టుకున్న చైనా విషయంలో ప్రతీ భారతీయుడి కడుపూ మండిపోతోంది. 

 

మరి ఇక్కడే ఇలా ఉంటే చైనా అక్రుత్యాలని నిత్యం చూస్తూ వస్తున్న భారతీయ జవాన్లలో ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిందే. గాల్వాన్ సరిహద్దుల్లో చైనా దురాగతానికి ధీటుగా బదులిస్తామని భారత సైనికులు అంటున్నారుట. వారిని ఆపడం ఆర్మీ పెద్దల వశం కావడంలేదని వార్తలు వస్తున్నాయి.

 

ఒక్క చాన్స్ ఇస్తే చాలు కుమ్మి పారేస్తామని అంటున్నారని సమాచారం. భారత ప్రభుత్వం ఓ వైపు అఖిలపక్షం సమావేశం పెట్టింది. అంతే కాదు వివిధ‌ ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తోంది. చైనా వంటి పెద్ద దేశంతో ఢీ కొట్టే ముందు అంతర్జాతీయ సమాజం మూడ్ ని వారి ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. 

 

ఇంకోవైపు చూస్తే ఆర్ధికంగా చైనాను ఎలా దెబ్బ కొట్టాలి అన్నది కూడా ఆలోచన చేస్తోంది. అయితే చైనా చేసిన ఈ ఘాతుకానికి ముల్లుకు ముల్లు, కళ్లకు కళ్ళు అన్న సిధ్ధాంతమే అనుసరించాలని సైన్యం నుంచి వినవస్తున్న మాట. భారతీయుల ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. మరి విజయమో, వీరస్వర్గమో అన్నట్లుగా మన జవాన్లు కనుక కదం తొక్కితే నక్కజిత్తుల డ్రాగన్ చిత్తు చిత్తు కావడం ఖాయమని అంటున్నారు. చూడాలి.

 

మరో వైపు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు కూడా చైనాకు సరైన జవాబు చెప్పమనే కోరుతున్నాయి. ఈ విషయంలో పూర్తి మద్దతు కేంద్రానికి ఇస్తామని కూడా హామీ ఇచ్చాయి. మొత్తానికి చైనా దూకుడుకు శాశ్వతంగా గుణపాఠం చెప్పడానికే రంగం సిధ్దమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: