తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో గెలిచింది కేవలం 23 సీట్లు. కానీ ఇప్పుడు ఆ 23 మందిలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరామ్ వంటి వారు పార్టీకి దూరమయ్యారు. అంటే మూడు ఓట్లు ఫట్.. అంటే టీడీపీ బలం 20కు పడిపోయిందన్న మాట. ఈ ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు.

 

 

అయితే వాస్తవంగా వీళ్లు టీడీపీకి గుడ్ బై చెప్పారా అంటే చెప్పలేదు. అలాగని పార్టీలోనూ లేరు. రోజూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబును తిడుతూనే ఉంటారు.. జగన్ ను పొగుడుతూనే ఉంటారు. అంటే వీళ్లను రెబల్ ఎమ్మెల్యేలు అనొచ్చు. అంటే వాళ్లు ఇప్పటికీ టెక్నికల్ గా తెలుగు దేశం ఎమ్మెల్యేలే. మరి ఎందుకు వీరి ఇంకా టీడీపీలోనే ఉన్నారు. పార్టీ నుంచి ఎందుకు బయటకు రావడం లేదు.

 

 

పోనీ టీడీపీ అయినా ఎందుకు వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదు.. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. వీరు ఎప్పుడైతే టీడీపీ నుంచి బయటకు వస్తారో.. వేరే పార్టీలో చేరతారో అప్పుడు వీరు పార్టీ ఫిరాయంపుల చట్టం ప్రకారం తమ ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోతారు. అందుకే వారు తమ పార్టీ నుంచి బయటకు రారు.

 

 

దీనికి తోడు ఇప్పటికే జగన్ ఇతర పార్టీల వారిని రాజీనామా చేయకుండా తన పార్టీలో చేర్చుకునేది లేదని ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పారు. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీలు పార్టీలోకి రావాలంటే.. పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ వైసీపీ తరపున బరిలో దిగి గెలవాల్సిందే. ఇది స్వయంగా జగన్ పెట్టిన రూల్. ఇప్పుడు దాన్ని వాళ్లే ఉల్లంఘించలేరు కదా. పోనీ.. రాజీనామా చేసినా మళ్లీ కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం కూడా ఉండాలి. ఇప్పుడు అంత రిస్క్ అవసరమా అని ఆ నాయకులు భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: