తెలుగు దేశం పార్టీ ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుని ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రాంతీయ పార్టీల్లో పార్టీల గెలుపోటములకు అధ్యక్షుడిదే ప్రధాన బాధ్యత.. గెలిచినా ఆయన గొప్పదనమే.. ఓడినా ఆయన వైఫల్యమే.

 

 

అందుకే.. ఇప్పుడు చంద్రబాబు పార్టీ అధ్యక్ష స్థానం నుంచి దిగిపోవాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ ని విజయం వైపు నడిపించడం చంద్రబాబు వల్ల కాదంటున్నారు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టిడిపి పార్టీ ఇచ్చిన విప్ అందలేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరి అన్నారు. తనకు విప్ అందలేదని, అయినా తాను పార్టీ కోరినట్లు వర్ల రామయ్యకే వేశానని ఆయన చెప్పారు.

 

 

ఇక పార్టీ పరిస్థితి గురించి మాట్లాడిన మద్దాలి గిరి.. పార్టీ పరిస్థితి బాగోలేదని, ఈ ఎన్నికలో ఓడిపోతామని కూడా తెలిసి దళితుడుని బలి చేయడం బాగోలేదని అన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న తప్పులను తెలుసుకుని వేరేవారికి పార్టీని అప్పగించడం మంచిదని హితవు పలికారు. చివరకు కనీసం లోకేష్ కు అయినా అధ్యక్ష పదవి ఇవ్వాలని మద్దాలి గిరి సూచించారు.

 

 

ముఖ్యమంత్రి జగన్ పలు సంక్షోమ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారని మద్దాలి గిరి అన్నారు. అయితే.. కొద్దిసేపు మద్దాల గిరి, వల్లభనేని వంశి, కరణం బలరాం ఎవరికి ఓటు వేశారన్నది అర్థం కాలేదు. మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ క్వారంటైన్ లో ఉన్నానంటూ పోలింగ్ కు హాజరు కాలేదు. ఇక అచ్చెన్నాయుడు పోలీస్ రిమాండ్ లో ఉన్నందున ఓటింగ్ కు రాలేదు. మరి ఈ మద్దాలి గిరి మాటలు టీడీపీ బాస్ చెవినపడతాయా.. ఆయన వాటిని పట్టించుకుంటారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: