కరోనా.. ప్రపంచవ్యాప్తంగా మనుషులను భయపెడుతున్న రోగం ఇది. ఇప్పటి వరకూ మందు కనిపెట్టని రోగం. అయితే ఈ రోగానికి సంబంధించిన ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న డేటా కాస్త ఉపశమనం కలిగించేదే. ఇది ఆరోగ్యంగా ఉన్నవారికి సోకటం తక్కువని.. సోకినా ప్రాణాలు తీసేంతటి ప్రమాదం ఉండదని అనుకున్నాం.

 

 

అది వాస్తవమే అయినా.. ఇప్పుడు కరోనా గురించి మరో భయంకరమైన వాస్తవం ఒకటి మరింతగా భయపెడుతోంది. అదేంటంటే.. ఒకసారి కరోనా వచ్చి నయమైన తర్వాత కూడా మళ్లీ ఈ వ్యాధి రాదని.. ప్రాణాలు హరించదని నమ్మకం ఏమీ లేదట. సాధారణంగా ఒకసారి ఓ వ్యాధి వచ్చి తగ్గిపోతే.. ఆ మనిషి శరీరంలో వ్యాధికారక కణాలను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయి.

 

 

ఆ వ్యక్తిలోని వ్యాధినిరోధక శక్తి స్థాయిని బట్టి వాటి కాలపరిమితి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి వైరస్ వంటి జబ్బులు వచ్చి తగ్గిపోతే.. మళ్లీ రెండు, మూడేళ్ల వరకూ ఈ జబ్బు రావడం అరుదు. కానీ ఈ కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో యాంటీబాడీలు రెండు, మూడు నెలలు మాత్రమే ఉంటున్నాయట. అంతేకాదు, కరోనా లక్షణాలతో బాధపడిన వ్యక్తులతో పోల్చితే, లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో తక్కువస్థాయిలో యాంటీబాడీలు ఏర్పడుతున్నట్టు తెలిపారు.

 

 

కరోనా నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు తయారవుతున్నట్టు గతంలోనే గుర్తించారు. కానీ అవి ఎంతకాలం ఉంటాయన్న దానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. కానీ.. తాజా వివరాలు చూస్తుంటే.. కరోనా యాంటీబాడీలు కాల వ్యవధి చాలా తక్కువని తెలుస్తోంది. అంటే ఒకసారి కరోనా వస్తే మళ్లీ రాదన్న గ్యారంటీ ఏమీ లేదన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: