ప్రజల ముంగిట పాలన.. ప్రజల ముంగిట ప్రభుత్వం.. ఎప్పుడో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన నినాదం.. ఆయన నినాదం అప్పట్లో ఓ సంచలనం.. ఆ తర్వాత చంద్రబాబు దాన్ని ప్రజల వద్దకే పాలన.. అంటూ కాస్త మార్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జగన్ సర్కారు మరో అడుగు ముందుకు వేస్తోంది.

 

 

జనం అవసరాలు తీర్చే వాడే నాయకుడు. అలాంటి వాడు కాబట్టే జగన్.. పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. జనం వద్దకే సకల సౌకర్యాలు అందాలన్నది ఆయన కాన్సెప్టు. అందుకే గ్రామ వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు పించన్లు సహా ప్రభుత్వ సాయం అంతా వాలంటీర్ల చేతుల మీదుగానే జరుగుతోంది. ఇప్పుడు జగన్ మరో చక్కని సౌకర్యం అందించబోతున్నాడు.

 

 

అదే.. అవినీతికి తావు లేకుండా నాణ్యమైన నిత్యావసర సరుకులను పేదల ఇంటికే చేర్చడం. ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించడం, దీని లక్ష్యం. అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థను నేరుగా జనం ఇంటి ముందుకే తీసుకొస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులను డోర్‌ డెలివరీ చేస్తారు. ఆ దిశగా అందుకు అవసరమైన ఏర్పాట్లును ప్రభుత్వం సిద్ధం చేసింది.

 

 

నిత్యావసర సరుకుల పంపిణీకి రూపొందించిన మొబైల్‌ వాహనాలను ప్రభుత్వం తయారు చేయించింది. ఆ నమూనాలను మంత్రులు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీరంగనాథరాజు పరిశీలించారు. కొన్ని మార్పులు చేర్పులను అధికారులకు సూచించారు. ఈ వాహనాల ద్వారా నేరుగా ప్రజల ఇంటి ముందుకే వెళ్లి తూకం వేసి చూపించి మరీ సరుకులు అందజేస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: