జర్నలిజం.. ఇదో విచిత్రమైన రంగం.. ఇది పూర్తిగా ప్రైవేటు రంగం.. కానీ నిత్యం ప్రజలతో మమేకమైంది. ప్రజలే కాదు.. ప్రభుత్వాలపైనా దీని ప్రభావం అపారం.. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని చాలా మంది పారిశ్రామిక వేత్తలు తపిస్తుంటారు. పెద్దగా లాభాలు లేకపోయినా టీవీలు, పేపర్లు పెట్టేస్తుంటారు. ఇదో గ్లామర్ ఫీల్డ్ అని చెప్పాలి.

 

 

అయితే మీడియా అంటే ఏదో ఒక స్టాండ్ తీసుకోవడం ఇప్పుడు రొటీన్ అయ్యింది. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. తెలుగులో ఉన్న మీడియాలో ఇలా ఏ స్టాండూ తీసుకోకుండా.. ఏ పత్రికకూ అనుబంధంగా ఉండకుండా ఏ మీడియా ఉండటం లేదు. అందులోనూ ఈ రోజుల్లో ప్రభుత్వాలు కూడా మీడియాల పట్ల కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ఇస్తే ఏమాత్రం సహించడం లేదు.

 

 

ఇప్పుడు తెలుగులో అటు ఏపీ సర్కారుతోనూ.. ఇటు తెలంగాణ సర్కారుతోనూ పోరాడుతున్న ఛానల్ గా టీవీ5 ను చెప్పుకోవాలి. తెలుగు దేశానికి అనుకూలంగా ఉంటుందని పేరుపడిన టీవీ5 ఇప్పుడు ఏపీలో కష్టాలు ఎదుర్కొంటోంది. పార్టీ యాంకర్ మూర్తి, ఓనర్ నాయుడుపై కేసులు పెట్టిన ఏపీ సీఐడి విచారణ పేరుతో వేధిస్తున్నారని సాక్షాత్తూ ఆ ఛానల్ యాంకర్ మూర్తి ఓ వీడియోలో వాపోయారు.

 

 

మరోవైపు ఈ ఛానల్ ఇటు తెలంగాణ సర్కారుకూ ఇబ్బంది కరంగానే మారింది. మాస్ మల్లన్న ప్రోగ్రామ్ చేస్తున్న నవీన్ కుమార్ తరచూ తెలంగాణ సర్కారుపై వ్యతిరేక కథనాలు ఇస్తుండటంతో తెలంగాణ సర్కారు పెద్దలు గుస్సాగా ఉన్నారు. ఇలా రెండు ప్రభుత్వాలతో యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: