కరోనా వైరస్ భయం దేశాన్ని వణికిస్తోంది. ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా, కొత్తగా నమోదవుతున్న కేసులు గతం కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండడంతో పాటు, మరణాల శాతం ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తారని అంతా భావించారు. కానీ లాక్ డౌన్ విధించినా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదని భావించిన కేంద్రం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఇక కొన్ని రాష్ట్రాలు సొంతంగానే లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకున్నాయి.. ముఖ్యంగా ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావంతో వణికిపోతోంది. పరిస్థితి ఎలా చేయాలో తెలియక ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మంత్రులు, అధికారులు, ఇలా ఎవరిని వదిలి పెట్టకుండా కరోనా సోకడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది.

IHG


 ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో లాక్ డౌన్ విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ లు వస్తున్నాయి. సీఎం కేజ్రీవాల్ మాత్రం లాక్ డౌన్ విధించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని భావించారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో, రాజకీయాలను సైతం పక్కనపెట్టి కేంద్రాన్ని ఈ విషయంలో రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేయాల్సిందిగా వారు కోరారు. ఈ మేరక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో  కేజ్రీవాల్ తాజాగా భేటీ అయ్యారు. ఈ విషయంలో కేంద్రం రంగంలోకి దిగాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. రోజుకు రెండు వేలకు తగ్గకుండా కొత్త కేసు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా 1500 వరకు చేరడంతో అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

 


 ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి, కరోనా కట్టడి పై ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రోజుకు 18 వేల పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ ఉన్నవారిని  గుర్తించి ప్రత్యేకంగా చికిత్స అందించాలని నిర్ణయించుకున్నారు. కరోనా పరీక్షలు చేసిన 48 గంటల్లోనే ఫలితాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: