జనసేన పార్టీకి వైసీపీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీ ఏ నిర్ణయాన్ని తీసుకున్న ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం విషయంలో పవన్ కళ్యాణ్ ముందస్తు స్థానంలో ఉంటాడు. అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన వైరాన్ని మరచి వైసీపీ నేత తో భారీ డీల్ కుదుర్చుకున్నాడని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ కి ముందు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లతో పాటు రాజకీయ విషయాలలో నిమగ్నమయ్యాడు. కానీ కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆయన ఎటువెళ్లలేక రాజకీయాలకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంటి దగ్గరే సేదతీరుతున్నాడు. 


వకీల్ సాబ్, విరూపాక్ష (దర్శకుడు క్రిష్) సినిమాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అప్పుడే అయిపోయిందనుకోకు... ఇప్పుడే మొదలైంది(తాజా సమాచారం ప్రకారం)' అనే సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ మూడు సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాలు తీయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం లోపు అనగా 2024వ సంవత్సరం లోపు బాగా డబ్బు సంపాదించి తన పార్టీని తీవ్ర స్థాయిలో బలోపేతం చేసి గెలవాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని అందరూ భావిస్తున్నారు. 


అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్వైసీపీ నేతతో భారీ డీల్ ఒప్పుకున్నట్టు సమాచారం అందుతుంది. ఆ వైసీపీ నేత మరెవరో కాదు వ్యాపార వేత్తగా పేరొందిన ప్రసాద్ వి. పొట్లూరి. ఇతను బలుపు సినిమా ద్వారా నిర్మాతగా అవతారమెత్తి ఆపై ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించాడు. ఆ క్రమంలోనే వైసీపీ పార్టీలో చేరి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు కానీ రాజకీయాల్లో క్రియాశీలకంగా నే పని చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించే మూడు సినిమాలను మినహాయించి మరికొన్ని సినిమాల్లో కూడా నటించాలనే ఉద్దేశంతో v POTLURI' target='_blank' title='ప్రసాద్ వి పొట్లూరి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ప్రసాద్ వి పొట్లూరి ని సంప్రదించినట్టు సమాచారం. అతడి నిర్మాణంలో సినిమా చేసేందుకు పవన్ సిద్ధమయ్యాడని... అప్పుడే v POTLURI' target='_blank' title='ప్రసాద్ వి పొట్లూరి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ప్రసాద్ వి పొట్లూరి అతనితో ఒక భారీ డీల్ కుదుర్చుకున్నాడని సినీ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా ఆ భారీ డీల్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: