ఆకాశం నుంచి ఉల్కలు, తోకచుక్కలు, గ్రహశకలాలు భూమిపై పడుతూ ఉడటం, భూమి పక్క నుంచి వెళ్తూ ఉడటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆకాశం నుంచి ఓ వింత వస్తువు  భూమిపై పడి అందరిని కలవరపెట్టింది. 2.8 కిలోల బరువు ఉన్న ఈ వస్తువును చూసి కంగారు పడ్డారు. రాజస్థాన్‌ రాష్ట్రంలో జలోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోహంగా కనిపించే దీన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి వైపరిత్యం ముంచుకు వస్తుందోనని అంతా చర్చించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని దాన్ని పరిశీలించారు. అది ఉల్కగా గుర్తించి ఎవరూ బయపడాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. 

 

మొన్న ఇప్పుడు ఆస్ట్రేలియాలోని పిల్‌బారాలో పడిన అగ్నిగోళం... ఆకుపచ్చ (green color)లో ఉండటం అందరనీ ఆశ్చర్యపరిచింది. జనరల్‌గా అగ్నిగోళాలు... ఎర్రటి మంటతో... దాదాపు తెలుపు, పసుపు రంగులో కనిపిస్తాయి. మరి ఇది గ్రీన్‌గా ఎందుకుంది అని ప్రజలు చర్చించుకున్నారు. "వావ్.. వాటే కలర్" అంటూ దాన్ని వీడియో తీశారు. సాధారణంగా పసుపు, తెలుపు రంగులో ఉండాల్సింది.. కానీ గ్రీన్ కలర్ లో రావడం చూసి మొదల ఏలియన్స్ గా భావించారు.  ఈమధ్య బ్రిటన్‌లో ఓ కాంతి ఏదో ఆకాశంలో అలా వెళ్లింది. ఐతే... అది రంగులు మారుతూ వెళ్లడంతో దానిపై యూఫాలజిస్టులు రకరకాలుగా మేటర్ అల్లారు.

 

ఇప్పుడు ఆస్ట్రేలియాలో పడిన అగ్నిగోళం మరో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా రాజస్థాన్‌ రాష్ట్రంలో జలోర్ జిల్లాలో సాంచోర్‌లోని గాయత్రి కాలేజీ సమీపంలో ఉన్న రహదారిపై ఆకాశం నుంచి ప్రకాశవంతమైన వస్తువు పడిపోయింది. లోహం ముద్దను పోలి ఉన్న ఈ ముక్క నాలుగైదు అడుగుల లోతులోకి కూరుకుపోయింది. దీన్ని చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేడిగా ఉండి, మెరుస్తూ ఉండటంతో అంతా ఆందోళన చెందారు. అయితే ఇవి ఆకాశలో తిరిగే ఉల్కలుగా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: