ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న వైరస్ కరోనా.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తుంది. కరోనా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కొత్త లక్షణాలు వచ్చి చేరుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలిగి చివరికి కన్నుమూస్తున్నారు.  కండరాల నొప్పి, రుచి, వాసన శక్తిని కోల్పోవడం మొదలైన వాటిని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనా లక్షణాల జాబితాలో చేర్చింది. అకారణంగా చలి, చలితో వణకడం, గొంతు నొప్పి మొదలైనవి కూడా కరోనా లక్షణాలని సీడీసీ తెలిపింది. ఈ లక్షణాలు అనే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. 

IHG

స్వీయ నిర్బంధంలో ఉంటూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.  ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ ఎటాక్ కావడం ఖాయం.    ఇప్పుడు  కొంతమంది చిన్నపాటి జ్వరం వస్తే భయపడిపోతున్నారు.  మాములు దగ్గు, జలుబు వంటివి వచ్చినా హైరానా పడుతున్నారు.  ఛాతిలో నొప్పి ఆగకుండా వస్తుండటం లేదా ఛాతిపై ఒత్తిడి ఉండటం అనేవి కూడా కరోనా లక్షణాలు అని తెలిపింది. పెదాలు లేదా ముఖం నీలి రంగులోకి మారడం కూడా కోవిడ్ లక్షణాలని తెలిపింది.

IHG

తాజాగాఈ వ్యాధిబారిన పడిన వారిలో కొత్త లక్షణాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. కళ్లు ఎర్రబారడం కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు. కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. ఇటీవల కళ్లు ఎరుపెక్కడంతో ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కంటి సమస్య ఏమి లేకపోవగా కరోనా అని తేలింది. దీంతో ఇది కూడా వైరస్ సోకిన వారిలో ఓ సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  తాము జరిపిన అధ్యాయనంలో కరోనా బాధితుల్లో పదిపదిహేను శాతం మందిలో కళ్లు ఎర్రబారడం లాంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: