గత రెండు నెలల వరకు కరోనా ప్రభావంతో కలియు దైవం వేంకటేశుడి దర్శన భాగ్యం కలగలేదు. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత దేవాలయాలు తెరిచారు. అక్కడక్కడ కొన్ని కరోనా కేసులు నమోదు కావడంతో మళ్లీ ఆలయాలు మూసివేశారు. ఇక రేపు సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా జూన్ 21న పూర్తిగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాన్ని నిలిపేస్తున్న‌ట్లు తెలిపింది టీటీడీ. అలాగే కొన్ని ఆర్జిత సేవ‌ల‌ను కూడా ర‌ద్దు చేస్తున్నట్లు ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. ఆదివారం ఉద‌యం 10.18 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుందని, దీంతో శ‌నివారం రాత్రి 8.30 గంట‌ల‌కు ఏకాంత సేవ తర్వాత మూసిన శ్రీ‌వారి ఆల‌య తలుపులను జూన్ 21న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు తెరుస్తామ‌ని చెప్పింది. ‌

IHG

మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హిస్తారని తెలిపింది. అనంత‌రం మొద‌టి అర్చ‌న‌, మొద‌టి గంట‌, బ‌లి శాత్తుమొర‌, రెండో అర్చ‌న, రెండో గంట త‌దిత‌రాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పింది.

IHG

ఈ సమయంలో భక్తులకు దర్శనాలు ఉండవు. సోమవారం నుంచి మాత్రం యదావిధిగా రావచ్చని తెలిపారు. కాగా కరోనా కారణంగా 80 రోజుల లాక్‌డౌన్ తర్వాత పరిమిత సంఖ్యలోనే శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ముందుగా కేవలం 7 వేల మందికే అనుమతి ఉండగా.. తాజాగా ఆ కోటాను పెంచి 10 వేల మందికి దర్శన భాగ్యం కల్పించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: